బన్సల్‌కు బకాయి చెల్లించాల్సిందే

Updated By ManamWed, 09/19/2018 - 00:23
rajiv

rajivన్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫినాన్షియల్ అధికారి రాజీవ్ బన్సల్‌కు తెగతెంపుల ప్యాకేజీపై మధ్యవర్తిత్వ కేసులో ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఓటమి చెందింది. రాజీవ్ బన్సల్‌కు చెల్లించాల్సిన రూ. 12.17 కోట్ల మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆర్బిట్రల్ ట్రైబ్యునల్ ఆదేశించినట్లు కంపెనీ బి.ఎస్.ఇకి తెలియజేసింది. తెగతెంపుల కింద బన్సల్‌కు చెల్లించిన దాంట్లో రూ. 5.2 కోట్లను తిరిగి చెల్లించేట్లు చేయాలని, నష్టపరిహారం ఇప్పించాలని కంపెనీ చేసిన ప్రతివాదనను ట్రైబ్యునల్ తిరస్కరించింది. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత, ఈ అంశంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ నుంచి వైదొలగుతున్న సమయంలో తెగతెంపుల మొత్తం కింద రూ. 17.38 కోట్లు ఇచ్చేందుకు లేదా 24 నెలల జీతాన్ని చెల్లించేందుకు ఆ ఐటీ సంస్థ అంగీకరించింది. బన్సల్‌కు రూ. 5 కోట్లు చెల్లించిన తర్వాత, తెగతెంపుల ప్యాకేజీ చాలా అధికంగా ఉందని కంపెనీ సహ స్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి, ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కంపెనీ చెల్లింపులను సస్పెన్షన్‌లో ఉంచింది. దాంతో మిగిలిన రూ. 12 కోట్లను క్లైమ్ చేసేందుకు బన్సల్ తన మాజీ యాజమాన్యాన్ని మధ్యవర్తిత్వ కోర్టుకు లాగారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ పాలనలో లొసుగులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ ఇన్ఫోసిస్ స్థాపకులు లేవనెత్తిన అంశాల్లో ఈ తెగతెంపుల ప్యాకేజీ ఒకటి. బన్సల్ 2015లో ఇన్ఫోసిస్ నుంచి నిష్క్రమించారు. కంపెనీ 24 నెలల జీతంతో సమానమైన రూ. 17.38 కోట్లు చెల్లించేందుకు అప్పట్లో అంగీకరించింది.

Tags
English Title
Bansal is to pay back
Related News