‘కత్తి’ రీమేక్ చేయనున్న బన్సాలీ

Updated By ManamTue, 08/21/2018 - 01:14
sanjay leela bhansali

imageఈమధ్యకాలంలో దక్షిణాది సినిమాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ దర్శకనిర్మాతల ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టెంపర్, అర్జున్‌రెడ్డి, ప్రస్థానం, విక్రమ్ వేదా వంటి సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన ‘కత్తి చిత్రం రీమేక్ చెయ్యడానికి రంగం సిద్ధమవుతోంది. చిరంజీవి హీరోగా తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఖైదీ నంబర్ 150’గా రీమేక్ చెయ్యడం, అది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం తెలిసిందే. తమిళ్‌లో విజయ్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ ‘కత్తి’ చిత్రాన్ని రూపొందించారు.

ఈ సినిమా రీమేక్ రైట్స్‌ని ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్ లీలా బన్సాలీ దక్కించుకున్నారు. గతంలో రవితేజ, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని హిందీలో ‘రౌడీ రాథోడ్’గా, విజయ్‌కాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన తమిళ సినిమా ‘రమణ’ను ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’గా బన్సాలీ రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ అక్షయ్‌కుమార్ హీరోగా నటించారు. ‘రమణ’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ‘రౌడీ రాథోడ్’, ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చిత్రాల్లో అక్షయ్‌కుమార్ హీరోగా నటించారు. ఇప్పుడు ‘కత్తి’ రీమేక్‌లో కూడా అక్షయ్‌కుమారే నటిస్తారా? లేక మరో హీరోతో చేస్తారా అనేది
 తెలియాల్సి ఉంది. 

English Title
Bansali in remake
Related News