బీసీసీఐకి ఊరట

Updated By ManamTue, 02/13/2018 - 20:45
BCCI WINS IPL TRADEMARK

ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు
BCCI WINS IPL TRADEMARKముంబై
: ఐపీఎల్ తరహాలో జూనియర్ క్రికెటర్లకు టోర్నీ నిర్వహించాలన్న స్పోర్ట్స్ సంస్థ ప్రయత్నాలను బీసీసీఐ సమర్థవంతంగా అడ్డుకుంది. వర్ధమాన క్రికెటర్ల కోసం జూనియర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (జెఐపీఎల్)ను నిర్వహించాలని గ్రేస్ ఇండియా స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐఎస్‌పీఎల్) భావించింది. ‘ఐపీఎల్’ అన్న తమ పేరుతో టోర్నీ నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ బీసీసీఐ ముంబై హైకోర్టులో పిటిషన్ వేసింది. ట్రేడ్‌మార్క్ ‘ఐపీఎల్’ను ఉల్లంఘించడాన్ని రద్దు చేస్తూ ముంబై హై కోర్టు మంగళవారం తీర్పు నిచ్చింది. దేశవాళీ పేర్లు పెట్టడం కానీ, ఆ పేర్లతో వెబ్‌సైట్స్ నడపడం కానీ చేయకూడదని జస్టిస్ ఎస్‌కే కథావాలా ఆదేశించారు. 

English Title
BCCI WINS IPL TRADEMARK INFRINGEMENT CASE
Related News