ఉసిరికాయతో ఎన్ని లాభాలో..

Updated By ManamWed, 11/07/2018 - 16:06
amla
amla

సీజనల్‌గా లభించే ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు రాలడం, చర్మ సమస్యలకు ఈ కాయ చాలా ఉపయోగపడుతుంది. ఇక ఉసిరికాయని ఎలా ఉపయోగిస్తే ఆరోగ్యంగా, అందంగా ఉంటారో ఇక్కడ చదవండి.

ఉసిరికాయ రసం... 
ఉసిరి రసాన్ని జుట్టుకి పట్టించడం వలన జుట్టు ఆరోగ్యాంగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు, జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది. మొటిమల నివారణకు కూడా ఉపయోగ పడుతుంది. ముఖం మృదువుగాను, మచ్చలు లేకుండా చేస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు ఉసిరి రసంలో కొన్ని నీళ్లు కలిపి పట్టుకోవడం మంచిది. 

ఎండిన ఉసిరి పేస్ట్ .....
ఆమ్లా పేస్ట్ తలకు పట్టించడం వలన జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది. ఎండిపోయిన ఉసిరికాయలతో పేస్ట్ చేసి తలకు పట్టించి తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వలన జుట్టు మెరుస్తూ, రాలడం తగ్గుముఖం పడుతుంది. 

ఉసిరి నూనె .. 
ఉసిరికాయ నూనె ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. ఫ్రెష్ ఉసిరి జ్యూస్, ఒక కప్పు కొబ్బరి నూనె, విత్తనాలు తీసిన ఉసిరికాయ ఒప్పులను తీసుకోవాలి. ముందు నీళ్లు వేయకుండా ఉసిరికాయని పేస్ట్ చేసి, ఒక పాన్‌లో కొబ్బరి నూనె, ఉసిరి జ్యూస్ వేసి ఉడకపెట్టిన తరువాత పేస్ట్‌ని వేసి ఉడకపెట్టాలి . ఈ నూనెను  20నిమిషాల ముందు పట్టించి తలస్నానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వలన జుట్టు ఆరోగ్యంగా, పెరుగుతుంది.  

English Title
beauty benefits of amla
Related News