మరణ సౌందర్యం

Updated By ManamSat, 04/14/2018 - 01:31
animal

animalజంతువుల్ని మనం మన అవసరాల కోసం పెంపుడు జంతువులుగా మార్చాం. వాటి చేత బరువులు మోయించాం, దుక్కి దున్ని వ్యవసాయం చేయించాం, వాటి పాలను, మాంసాన్ని మన డైనింగ్ టేబుల్ మీద అధరవులుగా మార్చుకున్నాం. వాటి చర్మంతో బ్యాగులు, సూట్‌కేసులు తయారు చేసుకుని మన ప్రయాణాల్ని సుఖవంతం చేసుకున్నాం. వాటి ఉన్నితో మనం చలికాచుకున్నాం. అయినా మనిషి దాహం తీరలేదు. జంతులోకాన్ని ప్రేమించి, గౌరవించి, వాటి ఉనికిని భావితరాల కోసం పదిలం చేసే ఉద్దేశం మొదలైన టాక్సిడెర్మీ కళ దారితప్పిన జాడలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. టాక్సిడెర్మీ ఆభరణాలతో జంతువులు మరణానంతరం కూడా మన అలంకరణాభిలాషను కూడా తీర్చడం ఒకింత బాధాకరమైన విషయం. ఇక్కడ కనిపిస్తున్నవి జంతువుల శరీర భాగాలతో తయారు చేసిన టాక్సిడెర్మీ ఆభరణాలు, వీటిని తయారు చేయడం కోసం జంతువుల్ని చంపలేదన్న హామీ మీదనే ఈ రకమైన ఆభరణాల అమ్మకాలు కొనసాగుతున్నాయి...

Tags
English Title
The beauty of death
Related News