అందుకే ఏపీకీ ప్యాకేజీ ఒప్పుకున్నాం!

Updated By ManamWed, 02/21/2018 - 12:09
Beeda Ravichandra

Beeda Ravichandra On AP Special Packageనెల్లూరు: ప్రత్యేక హోదా అవసరంలేదని టీడీపీ ఎప్పుడూ చెప్పలేదని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం చేశారు. హోదా అనే పేరు కావాలా? నిధులు కావాలా? అని కేంద్రం అడిగితే ప్యాకేజీకి అంగీకరించామని ఈ సందర్భంగా ఆయన క్లారిటీ ఇచ్చారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన... సమైక్య పోరాటమప్పుడూ ఏపీకి ఏం కావాలో కేంద్రాన్ని అడగలేదనీ.. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదనే ప్యాకేజీకి అంగీకరించామన్నారు. పవన్ రాష్ట్ర ప్రయోజనాలు కోసం పోరాడుతున్నారని రవిచంద్ర కితాబిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే అందర్నీ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తామన్నారు. అయితే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే అర్హత జగన్‌కు లేదని ఆయన చెప్పుకొచ్చారు.

English Title
Beeda Ravichandra On AP Special Package
Related News