సర్దార్ ఉండటం ఇతర ఆటగాళ్లకు ప్రేరణ

Updated By ManamWed, 06/20/2018 - 23:43
sardar
  • మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్.. చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు పయనం

imageబెంగళూరు: మన్‌ప్రీత్ సింగ్ భారత హాకీ జట్టులో కీలక ఆటగాడు. కెప్టెన్సీ కోల్పోయానన్న బాధ కూడా అతనికి లేదు. అయితే జట్టు సర్దార్ సింగ్ ఉండటం ఇతర ఆటగాళ్లకు ప్రేరణ ఇస్తుందని మన్‌ప్రీత్ అన్నాడు. నెదర్లాండ్‌లోని బ్రెడలో త్వరలో జరగనున్న ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత భాకీ జట్టు బెంగళూరులో శిక్షణ తీసుకుంటోంది. ప్రపంచ అత్యత్తమ మిడ్‌ఫీల్డర్‌లలో ఒకడైన సర్దార్‌ను ఒకానొక దశలో గోల్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ జట్టు నుంచి తప్పించారు. ఆ గేమ్స్‌లో మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అయితే సర్దార్ సింగ్ మాత్రం ఆశలు వదులుకోలేదు. మళ్లీ జట్టులో చోటు కోసం పోరాడాడు. కొత్త కోచ్ హరేంద్ర సింగ్‌ను మెప్పించి చాంపియన్స్ ట్రోఫీకి స్థానం సంపాదించాడు. ‘అపారమైన అనుభవమున్న మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్. అతను జట్టులో ఉండటం వల్ల ఇతర ఆటగాళ్లకు ఎనలేని ప్రేరణ లభిస్తుంది. లాంగ్ పాస్‌లు ఇవ్వగల సామర్థ్యం అతనికుంది’ అని చాంపియన్స్ ట్రోఫీకి బయల్దేరుతున్న సమయంలో మన్‌ప్రీత్ అన్నాడు. ఈ నెల 23 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు మిడ్‌పీల్డ్‌ను మరింత బలోపేతం చేసేందుకు సర్దార్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ గెలిచే అవకాశాలపై ఆడిన ప్రశ్నకు మన్‌ప్రీత్ స్పందిస్తూ.. పోడి యం చేరడమే లక్ష్యమన్నాడు. గత ఎడిషన్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 

హాకీని ‘నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా’గా ప్రకటించండి

భారత హాకీకి ‘నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా’గా అధికారికంగా నామకరణం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. భారత హాకీ ఇప్పటికీ అనధికారికంగా నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా హోదాను కలిగివుంది. అయితే నవంబర్‌లో హాకీ వరల్డ్ కప్‌కు ఒడిశా ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో అధికారిక హోదా ఇవ్వాలని పట్నాయక్ కోరారు. ‘సార్! ఈ ఏడాది నవంబర్‌లో ఒడిశాలో హాకీ వరల్డ్ కప్ జరగనుందని మీకు తెలుసు. 

అయితే హాకీ మన జాతీయ క్రీడగా అందరికీ తెలుసు. నిజానికి హాకీ మన జాతీయ క్రీడ అని ఎవ్వరూ గుర్తించడం లేదని సన్నాహక సమీక్షలో విని ఆశ్చర్యానికి, షాక్‌కు గురయ్యాను. మన దేశంలో హాకీ క్రీడకు కూడా కోట్లాది మంది అభిమానులున్నారని మీకు తెలుసు. నేషనల్ గేమ్ అన్న అధికారిక హోదా పొందేందుకు హాకీకి అన్ని అర్హతలున్నాయి. హాకీకి నేషనల్ గేమ్ అన్న అధికారిక హోదా ఇవ్వడం ద్వారా మన దేశాన్ని గర్వకారణంగా నిలిపిన గొప్ప ఆటగాళ్లకు ఘన నివాళి అర్పించినట్టవుతుంది’ అని ప్రధానికి రాసిన లేఖలో పట్నాయక్ పేర్కొన్నారు. సహారా స్థానంలో హాకీ జట్టుకు ఫిబ్రవరి నుంచి ఒడిశా ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

English Title
Being a Sardar is inspired to other players
Related News