‘సాక్ష్యం’ రివ్యూ

Updated By ManamFri, 07/27/2018 - 15:14
Saakshyam
Saakshyam

బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌
ప్ర‌ధాన న‌టీన‌టులు:  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్డే, శ‌ర‌త్‌కుమార్‌, మీనా, జ‌గ‌ప‌తిబాబు, అశుతోశ్ రానా, ర‌వి కిష‌న్, మ‌ధు గురుస్వామి, రావు ర‌మేశ్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, ప‌విత్రా లోకేశ్, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు
స్వ‌ర‌క‌ర్త‌: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
కెమెరా: అర్థ‌ర్ ఎ.విల్స‌న్‌
సంభాష‌ణ‌లు:  సాయిమాధ‌వ్ బుర్రా
క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
కూర్పు:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత‌: అభిషేక్ నామ‌
స‌మ‌ర్ప‌ణ‌: ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్‌, దేవాంశ్ నామా
ద‌ర్శ‌క‌త్వం: శ్రీవాస్‌

`అల్లుడు శీను` విడుద‌లై ఇప్ప‌టికి నాలుగేళ్లు. ఈ నాలుగేళ్ల‌లో ఆ చిత్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించింది నాలుగు సినిమాలు. తాజా సినిమా `సాక్ష్యం`. త‌న‌దైన క‌న్విక్ష‌న్‌తో, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో మార్కు క్రియేట్ చేసుకున్న శ్రీవాస్ ఈ సారి ప్ర‌కృతిని ప‌లవ‌రిస్తూ చేసుకున్న క‌థ `సాక్ష్యం`. ఆర‌డుగుల‌కు పైగా ఎత్తున్న సాయి శ్రీనివాస్ ఇందులో చేసిన యాక్ష‌న్ సీక్వెన్స్ ఇప్ప‌టికే సినిమాపై అంచ‌నాలు పెంచాయి. ట్రైల‌ర్ ప్రామిసింగ్‌గా ఉండ‌టంతో ప‌లువురు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మ‌రి అంచ‌నాలను ఈ సినిమా ఎలా చేరుకుంది? అంద‌రినీ మెప్పిస్తుందా? అనేది తెలుసుకోవాలంటే ఒక‌సారి రివ్యూ చ‌దివేయండి. 

క‌థ‌
న్యూయార్క్ లో  కొన్ని వేల కోట్ల‌కు అధిప‌తి విశ్వ సంస్థల అధినేత  శివ‌ప్ర‌కాష్ (జె.పి). ఆయ‌న భార్య (ప‌విత్రా లోకేష్) శివ భ‌క్తురాలు. వీరి త‌నయుడు విశ్వ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌). తండ్రి ఎక‌నామిక్స్ ని ఇష్ట‌ప‌డితే, కొడుకు అడ్వంచ‌ర్స్ చేయ‌డానికి మొగ్గుచూపుతుంటాడు. త‌న ఇష్ట‌ప్ర‌కార‌మే అడ్వంచ‌ర‌స్ వీడియో గేమ్స్ ని త‌యారు చేస్తుంటాడు. ఆ క్ర‌మంలోనే ఓ సారి సౌంద‌ర్య ల‌హ‌రి (పూజా హెగ్డే)ని చూస్తాడు. ఆమెని తొలి చూపులోనే ప్రేమించిన అత‌ను ఓ సారి ఆమెను చెంపపై కొడ‌తాడు. దాంతో బాధ‌ప‌డ్డ ఆమె కార‌ణాంత‌రాల వ‌ల్ల ఇండియాకు చేరుకుంటుంది. ఆమెను క‌న్విన్స్ చేసుకోవ‌డానికి ఇండియాకు వెళ్తాడు విశ్వ‌. అయితే అత‌నికి తెలియ‌కుండా కొంద‌రిని చంపుతుంటాడు. అందులో అత‌ని ప్ర‌మేయం ఉండ‌దు. అత‌ను చేస్తున్న ప‌నికి, అత‌ని టీమ్ త‌యారు చేసిన వీడియో గేమ్స్ కి కొన్ని సంబంధాలు క‌లుస్తుంటాడు. విశ్వ చంపిన వాళ్ల‌ల్లో మునుస్వామి (జ‌గ‌ప‌తిబాబు) సోద‌రులు ఉంటారు. వారికి ప‌ట్టిన గ‌తే చివ‌రికి మునుస్వామికి కూడా ప‌డుతుంది. ఇంత‌కీ మునుస్వామి ఎవ‌రు? అత‌ని ఊరు స్వ‌స్తిక్ పురంతో విశ్వ‌కున్న అనుబంధం ఏంటి?  నిజంగా ప్ర‌కృతి, పంచ‌భూతాలు మంచి వైపు నిలుస్తాయా?  చెడును ఎలా అంతం చేస్తాయి వంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ప్ల‌స్ పాయింట్స్‌:
- కెమెరా వ‌ర్క్‌
- నేప‌థ్య సంగీతం
- నిర్మాణ విలువ‌లు
- రివేంజ్ డ్రామాలో కాన్పెప్ట్ కొత్త‌గా ఉండ‌టం
మైన‌స్ పాయింట్స్:
- కామెడీ లేక‌పోవ‌డం
- పాట‌లు 
- ల‌వ్ ట్రాక్‌

స‌మీక్ష: 
ప్ర‌తి మ‌నిషి త‌ను చేసే త‌ప్పుల‌ను నాలుగు దిక్కుల్లో ఎవ‌రూ చూడ‌లేద‌నుకుంటాడు. కానీ  పై నుండి ప్ర‌కృతి అనే ఐదో క‌న్ను మ‌నిషి త‌ప్పుల‌ను గ‌మ‌నిస్తూ ఉంటుంది. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌కృతి లెక్క స‌రిచేస్తుంది. అనే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు శ్రీవాస్ సినిమాను చ‌క్క‌గా రాసుకున్నాడు. క‌థలో హీరో, హీరోయిజం ఉన్నప్ప‌టికీ.. దానికి ప్ర‌కృతి అనే ఎలిమెంట్ ఎలా యాడ్ అయ్యింది.. హీరో రాసుకున్న గేమింగ్‌లో అనుకున్న‌ట్లుగానే విల‌న్స్ హీరో చేతిలో చనిపోవ‌డం అనే పాయింట్స్ కొత్త‌గా ఉంటాయి. సంభాష‌ణ‌లు స‌న్నివేశాల ప‌రంగా బావున్నాయి. హీరో బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమా యాక్ష‌న్ ఎపిసోడ్ కోసం బాగానే క‌ష్డ‌ప‌డ్డాడు. సిక్స్‌ప్యాక్ అంతా పెంచాడు. హీరోయిన్ పూజాహెగ్డే కేవ‌లం పాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది. ఆమె పాత్ర ప‌రిధిమేర చ‌క్క‌గా న‌టించిందది. ఇక జ‌గ‌ప‌తిబాబు, అశుతోష్‌రాణా, ర‌వికిష‌న్ అండ్ గ్యాంగ్ విల‌నిజం సినిమా న‌డిచే క్ర‌మంలో బ‌ల‌హీనంగా అనిపిస్తుంది. ఇక రావు ర‌మేశ్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, ప‌విత్రా లోకేష్‌, వెన్నెల‌కిశోర్‌, కృష్ణ భ‌గ‌వాన్ త‌దిత‌రులు వారి వారి పాత్రల ప‌రంగా చ‌క్క‌గా న‌టించారు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వ‌ర్ సంగీతంలో పాట‌లు ఆక‌ట్టుకునేలా లేవు. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. అర్థ‌ర్ విల్స‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. లాజిక్స్‌కి నిమిత్తం లేకుండా కొన్ని ప‌నులు జ‌రుగుతుంటాయి. అలాంటి వాటిని చూడాలే త‌ప్ప ఏం చేయ‌లేమ‌నే కాన్సెప్ట్‌లో సినిమాను చిత్రీక‌రించారు. 
బోట‌మ్ లైన్‌:  సాక్ష్యం.. ప్ర‌కృతి చేసే ప్ర‌తీకార చ‌ర్య‌
రేటింగ్‌: 3/5

English Title
Bellamkonda Srinivas's Saakshyam review
Related News