బెల్లంకొండ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల

Updated By ManamFri, 11/09/2018 - 12:15
Kavacham
Kavacham

కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిల్ల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘కవచం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్‌గా నటిస్తుండగా.. ఆ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు.

ఇక ఈ చిత్రంలో బెల్లంకొండ సరసన కాజల్ అగర్వాల్, మెహ్రీన్ నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేశ్ విలన్‌గా నటిస్తున్నాడు. వశంధార క్రియేషన్స్‌పై థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Bellamkonda's next movie title is Kavacham
Related News