‘యూపీఏ’లోనే గిరిజనులకు లబ్ధి

Updated By ManamThu, 08/09/2018 - 23:50
Congress
  • లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి

  • కాంగ్రెస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం

  • పార్టీ నేతలు రఘువీరా, ఊమెన్ చాందీ

  • బెజవాడలో 76 మీ. జాతీయ జెండా ప్రదర్శన

imageవిజయవాడ: గిరిజనులకు యూపీఏ ప్రభుత్వంలోనే మేలు జరిగిందని, అటవీ హక్కుల చట్టంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 12.12 లక్షల ఎకరాలు పంపిణీ చేశారని  ఏపీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ పేర్కొన్నారు. గురువారం విజయవాడ లెనిన్‌సెంటర్‌లో  ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ సేవాదళ్ అధ్వర్యంలో 76వ క్విట్ ఇండియా ఉద్యమం దినోత్సవ  సందర్భంగా 76 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమెన్‌చాందీ, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లెనిన్ సెంటర్ నుంచి ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయం వరకు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

ఆంధ్రరత్న భవన్‌లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని  పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి.రాకేష్ రెడ్డి తదితరులకు ఉమెన్ చాందీ, రఘువీరారెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రరత్న భవన్‌లో సేవాదళ్ అధ్వర్యంలో జెండా వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమెన్‌చాందీ విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, వారికి నివాళులర్పించడంతో పాటు వారి ఆశయ సాధనకు కృషి చేయాడమే వారికి నిజమైన నివాళి అని అన్నారు.  క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపించిన మహాత్మా గాంధీని మనం స్మరించుకోవాలన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నం జరుగుతోంది, దీన్ని దేశ యువత తిప్పి కొట్టాలని కోరారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.

అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఆదివాసీల హక్కులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని రఘువీరారెడ్డిimage వివుర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీ, గిరిజనులకు 12లక్షల ఎకరాల భూమి, పట్టాలు పంపిణీ చేశారని వివరించారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి  నేడు చాలా పవిత్రమైన, ప్రత్యేకమైన రోజని, 76 సంవత్సరాల క్రితం బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టడానికి మహాత్మాగాంధీ నేతృత్వంలో ‘‘క్విట్ ఇండియా.. ఈ దేశాన్ని వదిలిపొండి’’ అని  సింహగర్జన చేసినటువంటి రోజని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని  రఘువీరా రెడ్డి పేర్కొన్నారు.

ఇప్పుడు అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారని వివుర్శించారు. గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని రఘువీరా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చింతామోహన్, గిడుగు రుద్రరాజు, మెయప్పన్, క్రిష్టోపర్ తిలక్, ఎస్.ఎన్.రాజా, పక్కాల సూరిబాబు, జంగాగౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

English Title
The beneficiaries of tribals in 'UPA'
Related News