భీతితోనే బీభత్సకాండ

Updated By ManamFri, 09/07/2018 - 07:50
editorial

imageసామాజిక విప్లవానికి భయపడే భారత్‌లో ఇటీవల వామపక్ష ఉద్యమకారుల అరెస్టులకు కారణంగా భావించవచ్చు. భారత్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అతిశయించిన (జిడఞ్ఛట) హిందువుతవాత శక్తుల ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక, ఆర్థిక విధానాల కు వ్యతిరేకంగా వస్తున్న సామాజిక విప్లవాన్ని చూసి బెదురుతోందనడానికి వామపక్ష ఉద్యమకారులను అరె స్టు చేయడం రుజువుగా నిలుస్తోంది. ఇలా వామపక్ష ఉద్యమకారుల అరెస్టుతో వారి కార్యకలాపాలు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశాలున్నాయి. కుల ఘర్షణ లు పెరిగేలా గత డిసెంబర్‌లో జరిగిన ఒక రాజకీయ ఘటనలో వామపక్ష ఉద్యమకారులు రెచ్చగొట్టే ప్రసం గాలు చేశారనే కారణంతో వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య’ దేశంగా స్వయంసత్తాక దేశంగా నిలుపుకునే అవకాశా న్ని దేశం కోల్పోయింది. ఈ అరెస్టులను ఖండిస్తూ వెం టనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ కింది విధంగా ట్వీట్ చేశారు.

‘భారత్‌లో ఆర్‌ఎస్‌ఎస్ (హిందూభావాలు కలిగిన పారామిలిటరీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) అని పిలవబడే ఒకేఒక్క ప్రభుత్వేతర సంస్థ (hyper)కు మా త్రమే చోటున్నది. ఇతర ప్రభుత్వేతర సంస్థలన్నింటినీ మూసేయండి. ఉద్యమకారులందరినీ జైళ్లలో పడేయం డి. ఆ కారణంతో వారిని కాల్చేయండి. నూతన భారతావని స్వాగత’మని రాహుల్ ట్వీట్‌చేశారు. ఈ పరిణామం అంతర్జాతీయ మీడియా దృష్టికి వెళ్లింది. ప్రపం చంలో పాకిస్థాన్, భారత్‌లోని ప్రతిపక్ష మీడియా మిన హా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దక్షిణాసియా దేశంలో వేగవంతంగా విస్తరిస్తున్న నిరం కుశత్వ దిగ్గజాన్ని ప్రపంచంలోని చాలాభాగం విస్మరించింది. 2014లో అతిశయించిన హిందు మతవాద (హిందుత్వ) పోకడలతో నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారనే అంశాన్ని ప్రపంచంలోని చాలా ప్రాంతాలు విస్మరించాయి. 

అవెురికాకు దీర్ఘకాలం ప్రత్యామ్నాయమైన చైనా, ప్రధాన ఆయుధ భాగస్వామి అయిన రష్యా, అత్యధి కంగా ఉత్పత్తి చేసే చైనా వస్తువులకు మార్కెటున్న ప్రధాన దేశంగా, యూరోపియన్ కంపెనీలకు చౌకగా వస్తువులు ఉత్పత్తి చేయగల దేశంగా సూక్ష్మ ఆర్థిక స్థాయిలో ప్రపంచంలోని అనేక దేశాలకు ఇండియా ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. దాంతో మోదీ తర చూ పలికే యోగ, అలాంటి ఇతర అంశాలనే గమనిస్తున్నాయి తప్ప ఆయన వెనుక ఉన్న వ్యాపార అజెండాలోని అసలు అంశాన్ని గ్రహించలేక విదేశాల్లోని ప్రతి ప్రభుత్వం కూడా ఇండియాలోని సామాజిక శక్తుల అసహనాన్ని గమనించడం లేదు. ముస్లింలను చిత్రవధలకు గురిచేయడం, గోవులను అంతమొందించేందుకు రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో ప్రజలను హింసిం చడం, చర్మ సంబంధమైన వస్తువులు ఎక్కువగా సంభవిస్తున్న ఘటనలు పరిశీలిస్తే న్యాయం జరగడాన్ని నిరాకరించడమే కాకుండా తమ కార్యకర్తలు చేస్తున్న నేరాలకు ఎవరినీ అరెస్టులుగానీ, నేరారోపణలకుగానీ గురిచేయకుండా కేవలం అందరికీ న్యాయం జరుగుతుం దనే శుష్క మాటలు మాత్రమే మోదీ నుంచి వింటు న్నాం. అంతేగాక, భారత్‌లో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు హిందు ఫైర్‌బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించడం ద్వా రా దేశమంతా కార్చిచ్చులా వ్యాప్తిచెందుతున్న మతవాదుల దూషణ ప్రసంగాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

మతవాదులు అనుసరిస్తున్న సాంఘిక-ఆర్థికపర మైన విధానాల వల్ల వైునారిటీలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయి. తరతరాలుగా ఛిద్రమైన తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచమని వందలాది మిలయన్ల మంది వైునారిటీలు (ప్రత్యేకంగా తక్కువ ‘కులాలు’) డిమాండ్‌ను పట్టించుకోకుండా దా డులు కొనసాగుతుండడంతో 1.2 బిలియన్ల జనాభా ఉన్న దేశంలో అశాంతి విస్ఫోటనానికి దారితీస్తోంది. భారత్‌లో జరుగుతున్న అంతర్గత తీవ్ర సమస్యలకు మకుటాయమానంగా నిలిచే ‘పద్మావత్’ ఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చునని నేను గతేడాది రాసిన వ్యాసంలో వివరించాను. కులపరమైన అశాంతికి మరో ఉదాహరణగా ముంబై కుల ఘర్షణలను చెప్పుకోవ చ్చు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ‘మూడో ఫ్రంట్’ అవసరాన్ని నొక్కిచెబుతోంది. భిన్నసంస్కృతులు, రాజ్యాం గపరంగా లౌకిక దేశంగా ప్రకటించుకున్న భారత్‌కున్న ప్రత్యేక (ఏౌఛఛ్ఛటజ్చీ) గుర్తింపును కోల్పోతోంది. ప్రభు త్వం అనుసరిస్తున్న హిందు అనుకూల సామాజిక వి ధానం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. హింసకు ప్రేరేపిస్తున్న ఆరోపణలతో ప్రముఖ వామపక్ష ఉద్యమకారులను అరెస్టు చేయడం ప్రభుత్వ భయాందోళనలను స్పష్టంచేస్తోంది. (యోగి ఆదిత్యనాథ్ వంటివారు ఎప్పటి నుంచో ఈ పద్ధతులను అనుసరిస్తున్నా వారిని వదిలిపెట్టి ఏకపక్షంగా వామపక్ష ఉద్యమకారులపై చర్యలకు దిగడం గమనార్హం). అరెస్టయిన వారిలో అందరూ ఆదివాసీలు (రైటెబల్స్), దళితులు (నిమ్నకులాలు), వామపక్ష లౌకికవాదులు, ముస్లింలు. వచ్చే ఏడాది రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ‘ఐక్య సంఘటన’ను ఏర్పాటుచేయగల సామర్థ్యం ఉన్నవాళ్లు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల్లో వామపక్ష, అతివాద శక్తుల వైఖరిని, ప్రభుత్వ వ్యతిరేకతను వినియోగించుకోగల స్థితిలో ఉన్నారు. దీనికి తోడు మతతత్వం వర్సెస్ ఫాసిజంలో రెండు వర్గాలు తమతమ మద్దతుదారులతో తీవ్ర భావజాలాలను ఉపయోగించుకుంటారు. 

అణచివేత పద్ధతులను అనుసరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి మరిన్ని అరెస్టులకు కేంద్రం పాల్పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వ మద్దతుదారులు పాల్పడుతున్న దాడులకు అంతర్జాతీయంగా అనుసరిస్తున్న సామాజిక-ఆర్థిక విధానాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న మోదీ... విపక్ష ఉద్యమకారులను లక్ష్యంగా కుటిల యత్నాలు కొనసాగే అవకాశాలున్నాయి. ఇవన్నీ చూస్తుంటే- ఇండియా సుస్థిరమైన దేశమని, చైనాతో పోటీపడే స్థితిలో ఉన్నదనే ప్రచారానికి వ్యతిరేకంగా ఊపునిచ్చినట్లవుతుంది. దేశంలో మరింత మతపర మైన కార్యకలాపాలు, కుల సంబంధమైన చర్యలు కొనసాగితే ఈ అరెస్టు నేపథ్యంలో వచ్చే యేడాది జరిగే ఎన్నికలు కొంతవేురకు రాజకీయ హింసకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాంతియుత సామాజిక విప్లవంపై అధికారులు భయపడుతున్నారో అర్ధమవుతోంది. మోదీ మొదటి టర్మ్ నుంచి తేలిగ్గా బయటపడడంపై అనుమానాలతో బీజేపీ వర్గాలు భయాందోళనల్లో మునిగిన వేళ ప్రతిపక్ష ఫ్రంట్‌ను భద్రతాధికారులు ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్నారో స్పష్టమవుతోంది. ప్రస్తుతం ‘లౌకిక భారత్’ను కోరుకునేవారికి, ‘హిందు రాష్ట్ర’ కోరుకునే శక్తులకు మధ్య పోరు నెలకొనిమన్నది. ఈ పోరే 21వ శతాబ్దపు అత్యంత కీలకమైన అధికార శక్తుల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. 

ప్రభుత్వ మద్దతుదారులు పాల్పడుతున్న దాడులకు అంతర్జాతీయంగా అనుసరిస్తున్న సామాజిక-ఆర్థిక విధానాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న మోదీ... విపక్ష ఉద్యమకారులను లక్ష్యంగా కుటిల యత్నాలు కొనసాగే అవకాశాలున్నాయి. ఇవన్నీ చూస్తుంటే- ఇండియా సుస్థిరమైన దేశమని, చైనాతో పోటీపడే స్థితిలో ఉన్నదనే ప్రచారానికి వ్యతిరేకంగా ఊపునిచ్చినట్లవుతుంది. దేశంలో మరింత మతపర మైన కార్యకలాపాలు, కుల సంబంధమైన చర్యలు కొనసాగితే ఈ అరెస్టు నేపథ్యంలో వచ్చే యేడాది జరిగే ఎన్నికలు కొంతవేురకు రాజకీయ హింసకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆండ్రూ కొరిబ్కో
(ఆసియా-పసిఫిక్ రీసెర్చ్ నుంచి)

Tags
English Title
Beware of fear
Related News