విరాట్ వ్యాఖ్యలపై భోగ్లే స్పందన

Updated By ManamFri, 11/09/2018 - 02:48
kohli-bhogle

kohli-bhogleన్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా విషయాల్లో ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇటీవల కోహ్లీ చేసిన ఒక కామెంట్ విమర్శలకు దారి తీసింది. తన బర్త్ డే సందర్భంగా విరాట్ అఫీషియల్ యాప్‌ను ఆవిష్కరించాడు. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ కోహ్లీని అనవసరంగా ఎక్కువ చేసి చూపిస్తున్నారని, అతని బ్యాటింగ్‌లో తనకు ఎలాంటి ప్రత్యేకత కనిపించదని, అతని కంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఆటే నచ్చుతుందని కామెంట్ చేశాడు. దీనిపై కోహ్లీ స్పందిస్తూ అలాంటప్పుడు ‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్లి అక్కడే ఉండు. ఈ దేశంలో ఉంటూ ఆ దేశాలను ఎందుకు పొగుడుతున్నావు? ముందు నీ పద్ధతి మార్చుకో’ అంటూ కోహ్లీ అతనికి క్లాస్ పీకాడు. దాంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు కోహ్లీ. ‘ఒక వ్యక్తికి ఆటగాళ్లు నచ్చడం అనేది వారి అభిప్రాయాల్ని బట్టే ఉంటుంది. ఏబీ డివిలియర్స్, జయసూర్య, షాహిద్ ఆఫ్రిది ఇలా ఆటగాళ్లకు దేశాలతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ఈ విషయాన్నే ఆ అభిమాని చెప్పాలని అనుకున్నాడు’ అంటూ నెటిజన్లు విరాట్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందించాడు. ఈ విషయంలో కోహ్లీ స్పందించిన తీరు సరిగా లేదని భోగ్లే అభిప్రాయపడ్డాడు. కోహ్లీలాంటి సెలబ్రిటీలు ఇలాంటి మచ్చలు ఏర్పడకుండా చూసుకోవాలని సూచించాడు. ఇది మంచిది కాదు. ఇదే భిన్నాభిప్రాయాలకు దారి తీస్తుంది అని భోగ్లే ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని చెప్పాడు.

ట్రోలింగ్ నాకు కొత్తేమి కాదు: విరాట్
ట్రోల్స్‌పై విరాట్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘ట్రోలింగ్ నాకు కొత్తేమి కాదు.. ట్రోలింగ్‌కి నేను కట్టుబడి ఉన్నాను. కానీ నేను చేసిన వ్యాఖ్యలు అటువంటి కామెంట్ చేసిన ‘ఆ భారతీయులను’ ఉద్ధేశించే. నేను వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తాను. కాబట్టి ప్రశాంతంగా ఉండి.. పండుగను ఆనందంగా జరుపుకోండి’ అని విరాట్ ట్వీట్ చేశాడు. అయితే కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వస్తున్నా.. మరికొందరు మాత్రం కోహ్లీ చేసిన కామెంట్స్‌కి మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.

English Title
Bhaggil response on Virat's comments
Related News