సత్యదేవునికి మఖానక్షత్ర అభిషేకం

Updated By ManamMon, 08/13/2018 - 00:33
annavaram
  • అన్నవరం మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు

  • పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 

imageఅన్నవరం: సత్యదేవుడి 128వ ఆవిర్భావ వేడుకలలో భాగంగా స్వామివారి మూల విరాట్‌కు మఖానక్షత్ర అభిషేకాన్ని నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన విఘ్నే శ్వరపూజ, పుణ్యాహావచనం, దీక్షా వస్త్రధారణ, కలశస్థాపన వంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అగ్నిప్రతిష్ట, మండపారాధన జరిగాయి.

నేటి సాయంత్రం ఫలపుష్పసేవ
సోమవారం స్వామివారి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే పూజలు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున మూడు గంటలకు మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం, నూతన యాగశాల ఆయుషు హోమం, ఉదయం పదిన్నర గంటలకు పూర్ణాహూతి, 10.45 గంటలకు ప్రాకారసేవ, 11.30 గంటలకు అవివేటి మంటపంలో పండిత సత్కారం, తదితర కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి ఫల పుష్ప సేవ చేస్తారు. దీనికోసం నిత్య కళ్యాణ మండపాన్ని ముస్తాబు చేస్తున్నారు. అనేక రకాల పండ్లు, పువ్వులతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. 

English Title
bhakthi news
Related News