భారత్ తీరు దురహంకారం

Updated By ManamSat, 09/22/2018 - 22:54
imrankhan
  • విదేశాంగశాఖ మంత్రుల భేటీ రద్దుపై ఇమ్రాన్‌ఖాన్

imrankhanఇస్లామాబాద్: ఇరు దేశాల విదేశాంగశాఖ మంత్రుల భేటీని రద్దు చేయ డంతో భారత్ దురహంకార పూరితంగా వ్యవహరించినం దని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. తాను భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానిని, ఆ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా ఇరు దేశాలు మంత్రులు భేటీ కావాలని నిర్ణయించామ న్నారు. కానీ, భారత్ సానుకూలంగా దృక్పథంతోకాకుండా వ్యతిరేక దృక్పథంతో వ్యవహరించిందని, ఇది తనకు తీవ్ర మనస్థాపాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. కశ్మీర్‌లో పాక్  ప్రోత్సాహిత ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి హత్య చేయడం, ఉగ్రవాది బుర్హాన్ వనీపై పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా భారత్ ప్రకటించింది. ఈ రెండు అంశాలతో ఇమ్రాన్ ఖాన్ నిజస్వరూపం ఏమిటో తెలిసిపోయిందని, చర్చల ఉద్దేశం కూడా అర్థమైందని, అందువల్లే చర్చలను రద్దు చేసుకున్నామని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

Tags
English Title
Bharat is arrogant
Related News