భారత్ డైనమిక్స్ ఐ.పి.ఓ

Updated By ManamTue, 03/13/2018 - 22:45
ipo

ipoముంబయి: షేర్‌కు రూ. 413-428 ధర బ్యాండ్‌తో భారత్ డైనమిక్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సంస్థలో ప్రభుత్వం తన వాటాను సుమారు 12 శాతం తగ్గించుకుంటూ మొత్తం 22,451,953 షేర్లను విక్రయిస్తోంది. గుత్తగా కనీసం 35 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ మార్చి 15వ తేదీతో ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూని ఎస్.బి.ఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐ.డి.బి.ఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, యస్ సెక్యూరిటీస్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. రక్షణ రంగానికి భూమి మీద నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు, యాంటి-ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, జలగర్భ ఆయుధ లాంచర్లు, కౌంటర్ మెజర్స్ అండ్ టెస్ట్ ఎక్విప్‌మెంట్ తయారీలో భారత్ డైనమిక్స్ నిమగ్నమై ఉంది. పెట్టుబడి ఉపసంహరణ ద్వారా రూ. 960 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Tags
English Title
Bharat dynamics IPO
Related News