సిరీస్‌పై కన్నేసిన భారత్-ఎ మహిళా జట్టు

Updated By ManamWed, 10/24/2018 - 01:03
team India women
  • నేడు ఆస్ట్రేలియా-ఎతో రెండో టీ-20

team India womenముంబై: భారత-ఎ మహిళా క్రికెట్ జట్టు సిరీస్‌పై కన్నేసింది.  తొలి టీ-20లో ఆస్ట్రేలియా-ఎను 4 వికెట్లతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత-ఎ జట్టు ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత మహిళా జట్టు కనిపిస్తోంది. వన్డే సిరీస్‌లో 0-3తో ఘోరంగా ఓటమి పాలైన భారత జట్టు ఇప్పుడు టీ-20 సిరీస్‌లో దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉన్నారు. అయితే వ చ్చే నెలలో జరుగనున్న టీ-20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ సిరీస్‌లో సీనియర్లకు చోటు కల్పించారు. తొలి టీ-20 మ్యాచ్‌లో స్మృతి మంధన అద్భుతమైన బ్యాటింగ్‌తో మరోసారి తన సత్తా చాటుకుంది. మంధన కేవలం 40 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసింది. మరోవైపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా దూకుడుగా ఆడి 39 బంతుల్లో 45 పరుగులు చేసి విజయంలో తనవంతు సహకారం అందించింది. వీరిద్దరి జోరుకు ప్రత్యర్థి ఆసీస్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని కూడా టీమిండియా అలవోకగా ఛేదించింది. అయితే మొదటి మ్యాచ్‌లో విజయం సాధించడంతో తమ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందని మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ చెప్పింది. మంధన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిందని ఆమె దూకుడుగా ఆడడంతో తాము గొప్ప విజయం సాధించామని తెలిపింది. అయితే రెండో టీ-20లోనూ తాము అదే ఉత్సహాంతో బరిలోకి దిగుతామని హర్మన్ చెప్పింది.

English Title
Bharat-A Women's Team on the Series
Related News