జీరో కట్స్‌తో 'భ‌ర‌త్‌ అనే నేను'

Updated By ManamMon, 04/16/2018 - 15:15
ban

banసూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ముఖ్యమంత్రి పాత్ర‌లో న‌టించిన చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. కియరా అద్వాణీ క‌థానాయిక‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డి.వి.వి.దాన‌య్య నిర్మించారు. ఈ నెల 20న ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (సోమ‌వారం) ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ సినిమాకి జీరో క‌ట్స్‌తో 'యు/ఎ' స‌ర్టిఫికేట్ జారీ చేసింది.

ప్ర‌కాశ్ రాజ్‌, శ‌ర‌త్ కుమార్‌, ఆమ‌ని, సితార త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించారు.

English Title
'bharath ane nenu' censor completed
Related News