'భ‌ర‌త్ అనే నేను'.. విడుద‌ల తేది మారింది

Updated By ManamTue, 02/13/2018 - 17:45
ban

banమ‌హేష్ బాబు ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని క‌థానాయిక‌గా న‌టిస్తోంది. డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. మార్చి 27 నాటికి చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ని.. ఏప్రిల్ 26న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఒక రోజు ముందుగా ఈ సినిమాని విడుద‌ల చేయ‌బోతున్నార‌న్న‌మాట‌. అదే రోజు(ఏప్రిల్ 26)న‌ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' కూడా విడుద‌ల‌వుతోంది. బ‌న్ని చిత్రానికి కూడా తొలుత ఏప్రిల్ 27నే విడుద‌ల తేదిగా భావించారు. అయితే, ర‌జ‌నీకాంత్ 'కాలా' ఏప్రిల్ 27న విడుద‌ల కానుండ‌డంతో.. ఈ రెండు సినిమాలు ఒక రోజు ముందుగా రిలీజ్ కాబోతున్నాయి. మొత్తానికి.. బాక్సాఫీస్ వ‌ద్ద ఆస‌క్తిక‌ర‌మైన పోటీ నెల‌కొన‌నుంద‌న్న‌మాట‌.

English Title
'bharath ane nenu' release date changed
Related News