ఘనంగా మంత్రి అఖిలప్రియ వివాహం

Updated By ManamWed, 08/29/2018 - 15:07
Bhuma akhila priya weds bhargav ram
akhila priya-bhargav ram wedding

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిలప్రియ వివాహం భార్గవ్ రామ్‌తో ఘనంగా జరిగింది. బుధవారం ఉదయం 10.57 నిమిషాలకు ళ్లగడ్డలోని కోటకందుకూరు మెట్టు వద్ద భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఈ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు టీడీపీ నేతలు, పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన భార్గవ్ రామ్‌కు రాయలసీమలో విద్యాసంస్థలు ఉన్నాయి. 

కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వివాహానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన బామ్మర్ది నందమూరి హరికృష్ణ అకాల మృతితో హాజరు కాలేకపోయారు.

Bhuma akhila priya weds bhargav ram

 

Bhuma akhila priya weds bhargav ram

Bhuma akhila priya weds bhargav ram

English Title
Bhuma akhila priya weds bhargav ram
Related News