కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్: ఉగ్రవాదులు హతం

Updated By ManamSat, 09/22/2018 - 19:04
Big Search Operations, Security Forces, Jammu And Kashmir, Pulwama

Big Search Operations, Security Forces, Jammu And Kashmir, Pulwamaశ్రీనగర్ (పుల్వామా): దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతంలో శనివారం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు పుల్వామా జిల్లాలో ఆర్మీ భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాయి. అరెంల్లా, అల్లిపొరా, నౌపొరా, పేయిన్, భట్టనూర్, గడ్‌బగ్, హిజిదాపూరతో కలిపి పలు గ్రామాల్లో భద్రతా దళాలు జల్లెడ పట్టాయి.

ఈ క్రమంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. అనంతరం ఘటనా స్థలం నుంచి భద్రతా సిబ్బంది పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

English Title
Big Search Operations By Security Forces In Jammu And Kashmir's Pulwama
Related News