మిథాలీపై త్వరలో సినిమా

Updated By ManamWed, 09/27/2017 - 19:27
Mithali Raj
  • నిర్మాణ హక్కులు పొందిన వయాకామ్18 సంస్థ

న్యూఢిల్లీ: సైనా నెహ్వాల్, కపిల్ దేవ్‌ల తర్వాత ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై సినిమా రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణ హక్కులను పొందినట్టు వయాకామ్18 మోషన్ పిక్చర్స్ సంస్థ తెలిపింది. ఇంగ్లండ్‌లో ఈ ఏడాది జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియాను ఫైనల్ వరకు తీసుకెళ్లడంతో మిథాలీ రాజ్ అందరి ప్రశంసలు అందుకుంది. కానీ ఫైనల్లో ఆతిథ్య జట్టు చేతిలో మిథాలీ సేన ఓటమిపాలైనప్పటికీ ఆమె బ్యాటింగ్ పోరాటం అందరినీ ఆకట్టుకుంది. తనపై తీస్తున్న ఈ సినిమా చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్న ఆశాభావాన్ని మిథాలీ వ్యక్తం చేసింది. 

English Title
A biopic on Indian women’s cricket team captain Mithali Raj in the works
Related News