మెజారిటీకి దూరంలోనే బీజేపీ!

Updated By ManamTue, 08/21/2018 - 00:24
modi
  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అంతే

  • 140 సీట్లవద్దే ఆగిపోనున్న కమలం పార్టీ

  • ఎన్‌డీఏ కూటమి 288 సీట్లకే పరిమితం.. ఇండియా టుడే-కార్వీ సర్వేలో వెల్లడి

modiన్యూఢిల్లీ: ఇప్పటికప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి మెజారిటీ భారీగా తగ్గి పోతుందని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లా సీట్లు సాధించకపోవచ్చునని ఇండియా టుడే- కార్వీ సంయుక్తంగా నిర్వహించిన ‘పోల్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది. 2014 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 272ను మించి బీజేపీ సొంతంగా 282 సీట్లల్లో గెలిచి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలి సిందే. తాజాగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 140 స్థానాలు వస్తాయని, మొత్తంగా ఎన్ డీఏ కూటమికి  281 సీట్ల కంటే ఎక్కువ రావని, యూపీఏకు 122 స్థానాలు వస్తాయని సర్వే వెల్లడిం చింది. ఈ సర్వేను ఈ ఏడాది జూలై 18- 29 మధ్య కాలంలో నిర్వహించారు. మొత్తంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలను ఒక్క బీజేపీయే సాధించలేదని తెలిపింది. భాగస్వామ్యపక్షాలపై ఆధారపడి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఎన్‌డీఏకు 336 సీట్లు ఉన్నాయి. అలాగే.. ఎన్‌డీఏకు 36 శాతం ఓట్లు వస్తయని, యూపీఏకు 31 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది

English Title
The BJP is far from the majority!
Related News