'కనిమొళిపై క్రిమినల్ కేసు నమోదు చేయండి'

Updated By ManamFri, 01/12/2018 - 11:15
BJP, files complaint,DMK MP Kanimozhi,Tirumala, G Bhanuprakash Reddy

BJP, files complaint,DMK MP Kanimozhi,Tirumala, G Bhanuprakash Reddyచెన్నై: డీఎంకే ఎంపీ కనిమొళిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల వేంకటేశ్వర స్వామిపై కనిమొళి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ నేపథ్యంలో గురువారం కనిమొళిపై తిరుపతి అర్బన్ ఏఎస్పీ శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేసినట్టు బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చెప్పారు.

రెండురోజుల క్రితం తమిళనాడులోని తిరుచినాపల్లిలో జరిగిన ఓ కాన్ఫిరేన్స్ సమావేశంలో రాజ్యసభ ఎంపీ కనిమొళి తిరుమల వెంకన్న స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కనిమొళి వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని రెడ్డి అన్నారు. ఆమెపై కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదును కూడా దాఖలు చేయనున్నట్టు భాను చెప్పారు. కాగా, కనిమొళి వ్యాఖ్యలపై బీజేపీ ఫిర్యాదు చేసినట్టు తిరుపతి పోలీసులు వెల్లడించారు. 

English Title
BJP files complaint against Kanimozhi for alleged remarks
Related News