అమిత్ షా వచ్చిన తర్వాతే...

Updated By ManamWed, 09/12/2018 - 18:22
bjp leader kishan reddy comments on party condidates list
  • కుటుంబ పాలనను ఓడించాలి

  • గ్రామాల్లో బీజేపీలో భారీ చేరికలు

  • ఎన్నికల షెడ్యూల్ తర్వాతే అభ్యర్థుల ప్రకటన

  • బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

bjp leader kishan reddy comments on party condidates list

హైదరాబాద్ : గత కొన్ని రోజలుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో మునిగిపోయాయి. కానీ బీజేపీ మాత్రం తమకేం తొందర లేదని, ముందెళ్లిన పార్టీలు తొందరగా అలసిపోతాయని ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ వంటి కుటుంబ పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగేండ్ల తర్వాత ఫ్రంట్ పెడతామని టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న వారసత్వ రాజకీయాలకు బుద్ధిచెప్పాలని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చిన తర్వాతనే ఏ పార్టీతోనైనా చర్చలు, పొత్తులు ఉంటాయని ప్రకటించారు.

కేంద్రంలో బీజేపీ పథకాలను చూసి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత చేరుతోందని తెలిపారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయినట్టు పేర్కొన్నారు. చుట్టు పక్కల రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, తెలంగాణలోనూ బీజేపీనే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ తీసుకువస్తున్న ఫ్రంట్‌ల‌తో టెంట్లతో తమకేమీ నష్టం లేదని విమర్శించారు. తెలంగాణలో తమ హామీలపై వస్తున్న విమర్శలను చూసి టీఆర్‌ఎస్ భయపడి ముందస్తు ఎలక్షన్స్ పెట్టిందని విమర్శించారు.

అసోంలో చివరి మూడు రోజుల్లో తీర్పు మారిందని, ఆంధ్రలో కూడా వారం రోజుల ముందు జగన్ ముందున్నప్పుటికీ మోదీ పర్యాటనతో టీడీపీ గెలిచిందని వివరించారు. తెలంగాణలో చేయాల్సిన కార్యచరణపై బహిరంగ సభలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. అమిత్ షా సభ తర్వాత తెలంగాణలో బీజేపీలో మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించబోమని, ఎన్నికల షెడ్యూల్ తర్వాతే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

English Title
bjp leader kishan reddy comments on party condidates list
Related News