బాలకృష్ణపై బీజేపీ నేతల ఫిర్యాదు

Updated By ManamSat, 04/21/2018 - 11:05
balayya

Balakrishna హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ నరసింహన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడిన విష్ణు కుమార్ రాజు.. ‘‘బాలకృష్ణపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ని కోరాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాం. బాలకృష్ణను అరెస్ట్ చేయాలని తాము క్రిమినల్ కంప్లైంట్స్ దాఖలు చేసిన విషయాన్నీఆయనకు చెప్పాం. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా అంగీకరించిన చంద్రబాబుపైనా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరాం’’ అని అన్నారు.

అలాగే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను చెప్పేందుకు కూడా తమకు నోరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన విష్ణు కుమార్ రాజు.. గతంలో సామాజిక మాధ్యమాల్లో నారా లోకేశ్‌పై మెసేజ్‌లు, వార్తలు వస్తే.. అవి రాసిన వారిని జైలుకు పంపించారని, మరి, మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

English Title
BJP leaders complaint on Balakrishna
Related News