అంతా కాపీ పేస్ట్‌‌లే..!: ఎమ్మెల్యే విష్ణు

Updated By ManamSun, 04/15/2018 - 15:59
BJP MLA

BJP MLA VS TDP

అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను.. దీక్ష విషయంలో ప్రధాని మోదీని.. సీఎం చంద్రబాబు కాపీ కొట్టారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబు చేసేది మొత్తం అంతా కాపీ ఫేస్ట్‌‌లే అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేవలం ఫొటో షూట్ కోసమే బాబు పార్లమెంట్ మెట్లకు మొక్కారని ఆరోపించారు.

"విదేశాలకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని నిందిచే సంస్కృతి ఎక్కడదీ?. ప్రధానిని విదేశాల్లో విమర్శిస్తే దేశంలో అందర్నీ అవమానించినట్టే. మీకేమైనా విదేశాలతో రహస్య ఒప్పందం ఉందా?. ఇదేనా మీ 40 ఏళ్ల రాజీకీయ అనుభవం?. 

మంత్రి గంటా గురించి..
ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. రాజకీయ కుట్రలకు గంటా మేధావి" అని సీఎం, గంటాపై.. ఎమ్మెల్యే విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

English Title
BJP MLA VIshnu Kumar Raju Sensational Comments On CM Chandrababu And Minister Ganta
Related News