టీడీపీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

Updated By ManamTue, 03/06/2018 - 10:25
BJP MLA Vishnu Kumar Raju

టీడీపీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ అమరావతి: టీడీపీపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన విష్ణు.. గుండాలను, రౌడీలను అద్దెకు తీసుకుని టీడీపీ ధర్నాలు చేస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు వెంటనే ఎమ్మెల్యే వాసుపల్లిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ మెడలు వంచుతామంటూ విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి ధర్నా చేశారని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రధర్మంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నామని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు మాట్లాడారు. సీఎం ఇంత జరుగుతున్నా ఇంకా మౌనంగా ఉంటే ఆయన ప్రోత్సాహం ఉందని భావించాల్సి ఉంటుందన్నారు.

కాగా విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ఏపీ ఎంపీలు సోమవారం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం కూడా ఆందోళన చేపట్టో యోచనలో వైసీపీ ఎంపీలు, వామపక్షాలు ఉన్నాయి. సభను అడ్డుకునేందుకు వైసీపీ, టీడీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు.

English Title
BJP MLA Vishnu Kumar Raju Sensational Comments On TDP
Related News