చంద్రబాబు మాటమారుస్తున్నారు: సోము వీర్రాజు

Updated By ManamTue, 02/13/2018 - 12:15
Somu Veerraju Allegations On Andhra Govt

Somu Veerraju Allegations On Andhra Govtవిజయవాడ: కేంద్రం ఇప్పటికే ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చిందని.. స్వయాన సీఎం చంద్రబాబే ఈ విషయాన్ని అంగీకరించారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన మరోసారి సీఎం చంద్రబాబు సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

బాబు మాటమారుస్తున్నారు..
" ప్రత్యేక ప్యాకేజీపై సీఎం చంద్రబాబు మాటమారుస్తున్నారు. సంతృప్తిగా ఉన్నాం.. కేంద్రం అన్నీ ఇచ్చిందని సీఎంతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా అనేకసార్లు చెప్పారు. ప్రత్యేక హెదాను బిల్లులో ఐదేళ్లే అని ఎందుకు పెట్టారు. ఐదేళ్లలో అన్నీ చేయాలని.. కాంగ్రెస్‌‌ బిల్లులో ఎందుకుపెట్టలేదు. హామీలు నెరవేర్చడానికి 2022వరకు సమయం ఉంది. రాజకీయ దుమారానికి మేము సమధానమిస్తోంది. చట్టంలో ఉన్న ఎనిమిది సంస్థలను కూడా నెలకొల్పారు" అని ఎమ్మెల్సీ వివరించారు.

అప్పుడో మాట.. ఇప్పుడో మాట..
"ప్రత్యేక ప్యాకేజీ బాగుందని మేం సంతృప్తిగానే ఉన్నాం, కేంద్రం అన్నీ ఇచ్చిందని సీఎంతో సహా అందరూ చెప్పారు. కానీ అప్పుడు బాగుందన్న వాళ్లు, ఇప్పుడు బాగోలేదని ఎందుకంటున్నారో చర్చించాలి. ప్రత్యేక హోదా అంటూ.. ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారు. ప్రత్యేక హోదా అన్నా.. అభివృద్ధి కోసం ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీ అన్నా ఒక్కటే" అని బీజేపీ వీర్రాజు చెప్పారు.

ఇప్పటి వరకు ఎంతిచ్చామంటే..
"భవనాల నిర్మాణానికి కేంద్రం రూ. 1500 కోట్లు ఇచ్చింది. వెంకయ్య మరో రూ.1000 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం గురించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్లాన్‌ ఉందా?. ప్రత్యేక హోదా రాలేదని ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోవడం లేదు. రైల్వేజన్, దుగరాజుపట్నం పరిశీలించాలని మాత్రమే బిల్లులో పెట్టారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్ని అనవసరంగా రెచ్చగొడుతున్నారు. దేశంలో విడిపోయిన రాష్ట్రాల్లో రైల్వే జోన్లే లేవు. ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటు చేసే బాధ్యత కేంద్రానిదే. దుగరాజుపట్నం పోర్టు బాధ్యత కూడా కేంద్రానిదే"అని ఆయన వివరించారు.
                             
బ్లూ ప్రింట్ ఏమైనా ఉందా?     
"వెనుకబడిన జిల్లాలకు ఇచ్చి నిధులు ఎలా ఖర్చు పెట్టారు? రాయలసీమ, ఉత్తరాంధ్ర నిధుల ఖర్చుకు రాష్ట్రం దగ్గర ఏమైన బ్లూ ప్రింట్ ఏమైనా ఉందా?. రెవెన్యూ లోటు రూ. 4,600 కోట్లుగా తేలిందీ కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.జ 16వేల కోట్లు అంటోంది. రుణమాఫీ, సంక్షేమం కూడా రెవెన్యూ లోటులో చూపారు. రైల్వేజోన్, కడపలో స్టీల్ ఫ్యాక్టరికీ ఫిజిబిలిటీ లేదని కమిటీలు చెబుతున్నాయి. 10 ఏళ్ల సమయం ఉన్నా.. చట్టంలో ఉన్నవి చేస్తున్నాం" అని సోము స్పష్టం చేశారు.

వాటికి డబ్బులెక్కడివీ!

పోలవరం నిర్మాణానికి వంద శాతం నిధులివ్వాలని మాత్రమే చట్టంలో ఉంది. పోలవరం ఎప్పటిలోగా కట్టాలనే కాలపరిమితి ఏమీ లేదు. ఇప్పుడు మాట్లాతున్నవాళ్లు.. ఆనాడు ప్రత్యేక హోదా, పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు. చంద్రన్న కానుక, తోఫా డబ్బులు ఎక్కడివో టీడీపీ చెప్పాలి. మోడీ వల్ల ప్రపంచ దేశాల్లో భారత్‌‌కు గౌరవం పెరిగింది" అని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.

English Title
BJP MLC Somu Veerraju Press Meet || Comments On TDP Leaders Over Budget 2018
Related News