అమిత్ షాకు నల్లజెండాలతో నిరసన

Updated By ManamSat, 08/11/2018 - 14:51
amit shah kolkata tour
  • అమిత్ షా పర్యటన సందర్భంగా కోల్‌కోతాలో  టెన్షన్ వాతావరణం

amit shah kolkata tour

కోల్‌కతా :  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కోల్‌కోతా పర్యటన ఉద్రిక్తంగా మారింది. అమిత్ షా పర్యటన సందర్భంగా... ఓవైపు బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం, మరోవైపు తృణమూల్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తాయి. శనివారం ఉదయం కోల్‌కతా విమానాశ్రయంలో అమిత్ షాకు పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. వందేమాతరం, జైశ్రీరామ్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

కాగా మయో రోడ్‌లో ఏ బీజేపీ యువ మోర్చా నిర్వహిస్తున్న యువ స్వాభిమాన్ ర్యాలీలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు.. ప్రధాని మోదీ, అమిత్ షా, ఎంపీ పూనం మహాజన్‌లకు స్వాగతం పలుకుతూ రోడ్ల వెంబడి భారీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.  అయితే దానికి కౌంటర్‌గా తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు అమిత్‌షా రాకను వ్యతిరేకిస్తూ ‘భాజపా గోబ్యాక్‌’ పోస్టర్లు పెట్టారు. 

అంతేకాకుండా అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓ దశలో అమిత్ షా కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తృణమూల్ కార్యకర్తలు యత్నించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో పలు ప్రాంతాల్లో కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

English Title
Black flags, anti-Bengal BJP go back posters welcome Amit Shah in Kolkata
Related News