కోడిగుడ్లను కక్కేసిన నాగుపాము.. వీడియో వైరల్!

Updated By ManamSat, 04/14/2018 - 16:30
Bloated cobra regurgitates SEVEN eggs in desperate bid to avoid capture after raiding chicken coop

Bloated cobra regurgitates SEVEN eggs in desperate bid to avoid capture after raiding chicken coop తిరువనంతపురం (కేరళ): ఆకలితో ఉన్న ఓ నాగుపాము ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి ఓ ఇంట్లో దూరింది. ఆ ఇంట్లో కోళ్ల అరుపులు శబ్దం విన్న నాగుపాము మెల్లగా కోళ్ల గూటిలోకి ప్రవేశించింది. పాము అలికిడితో కోళ్లు అరుస్తుండటంతో ఇంటి యజమాని వచ్చి పరీక్షించి చూశాడు. అంతే.. కోళ్ల గూటిలో ఉన్న పామును చూసి షాక్ అయ్యాడు. అప్పటికే కోళ్ల గూటిలోని పొదిగిన ఏడు కోడిగుడ్లను అమాంతం లోట్టలేసుకుంటూ నాగుపాము మింగేసింది. ఈ ఘటన కేరళలోని వేనాడ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. వెంటనే స్థానికంగా పాములు పట్టే సుజిత్ అనే వ్యక్తికి యజమాని సమాచారం అందించాడు. పాములు పట్టే సుజిత్.. అక్కడికి చేరుకొని నాగుపామును కోళ్ల గూటి నుంచి బయటకు తీశాడు. అప్పటికే ఓ కోడి మృతిచెందింది. 

ఈ క్రమంలో బెదిరిపోయిన ఆ పాము పారిపోయే ప్రయత్నంలో మింగిన 7 కోడిగుడ్లను అరిగించుకోలేక పాము పాట్లు పడింది. చివరికి మింగిన ఏడు కోడిగుడ్లను ఒక్కొక్కటిగా బయటకు కక్కేసింది. గుడ్లను పాము బయటకు కక్కేస్తుండగా అతడు వీడియో తీశాడు. మొత్తం ఏడు గుడ్లను పాము మింగినట్లు సుదీప్‌ తెలిపాడు. కోళ్ల గూటి నుంచి పామును బయటకు తీసిన తరువాత ఒక్కసారిగా జనమంతా గుమిగూడటంతో నాగుపాము భయపడిందని, అందుకే వెంటనే పొట్టలోని గుడ్లను బయటకు కక్కేసి వెళ్లిపోయిందని తెలిపాడు. నాగుపాము మింగిన కోడిగోడ్లను బయటకు కక్కేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..

English Title
Bloated cobra regurgitates SEVEN eggs in desperate bid to avoid capture after raiding chicken coop
Related News