రక్తమోడిన జాతీయ రహదారి

Updated By ManamFri, 09/21/2018 - 23:22
accident
  • విశాఖలో ఒకే రోజు మూడు ప్రమాదాలు

  • నలుగురి మృతి, ఏడుగురికి గాయాలు

accident నక్కపల్లి: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం జాతీయ రహదారిపై జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న మహేంద్ర వ్యాన్ మండలంలోని గొడిచెర్ల వద్ద ఆగి ఉన్న గూడ్సు ఆటోను ఢీకొంది. గూడ్సు ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని నక్కపల్లి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన వియ్యపు బాబ్జి (40) మరణించాడు. మెరుగైన చికిత్స విశాఖకు తరలిస్తుండగా తునికి చెందిన షేక్ ఫాతిమా (46), మరో వ్యక్తి మరణించారు. కాగా మండలంలోని సారిపిల్లవానిపాలెం వద్ద రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో మైలపిల్లి అయ్యన్న (35) తీవ్రంగా గాయపడ్డాడు. నక్కపల్లి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని మనబాలవానిపాలెం సమీపంలో మోటారు సైకిల్‌పై తునికి వెళ్తున్న నక్కపల్లికి చెందిన పోలినాటి వీరబాబు (34)ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వీరబాబును నక్కపల్లి ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. మూడు ప్రమాదాలకు సంబందించి పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. 

Tags
English Title
Bloody National Highway
Related News