టాటాతో బోయింగ్ కొత్త ఒప్పందం

Updated By ManamWed, 03/14/2018 - 23:01
TATA_Boeing

TATA_Boeingముంబయి: బోయింగ్ సంస్థకు చెందిన 787-9/10 డ్రీమ్‌లైనర్లకు అధునాతన కాంపొజిట్ ఫ్లోర్ దూలాల తయారీకి సంబంధించి ఒక కొత్త కాంట్రాక్టుపై అవెురికా విమానయాన దిగ్గజం బోయింగ్, టాటా గ్రూప్ కంపెనీ టి.ఎ.ఎల్ మా న్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ (టి.ఎ.ఎల్) బుధవారంనాడు సంతకాలు చేశాయి. నాగపూర్‌లోని టి.ఎ.ఎల్ కేంద్రంలో వాటిని తయారు చేస్తారు. బోయింగ్, వివిధ టాటా గ్రూప్ కంపెనీలు కలసి బోయింగ్‌కు చెందిన వాణిజ్య, సైనిక విమానాలకు అవసరైమెన వైమానిక భాగాలను ఇప్పటికే తయారు చేస్తున్నాయి. బోయింగ్ ఫ్లోర్ బీమ్‌ల మొదటి కాంట్రాక్టును టి.ఎ.ఎల్‌కు 2011 అక్టోబరులో ప్రదానం చేసింది. బి787-9, 787-10 వి మానాలకు ఏ.సి.ఎఫ్ బీమ్‌ల  సరఫరాకు సంబందించిన ఈ కొత్త కాంట్రాక్టు, భారతదేశం పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది అని బోయింగ్ ఇండియా అధ్యక్షుడు ప్రత్యూష్ కుమార్ చెప్పా రు. ఈ భాగస్వామ్యానికి మద్దతు ఇచ్చేందుకు బోయింగ్ అధునాతన టెక్నాలజీని సవుకూర్చింది. టి.ఎ.ఎల్‌తో సన్నిహితంగా పనిచేసింది అని కూడా ఆయన అన్నారు. నాగపూర్‌లో మిహాన్ ప్రత్యేక ఆర్థిక మండలంలోని వస్తూత్పత్తి కేంద్రం నుంచి 787 నిర్మాణానికి 13000వ ఫ్లోర్ బీమ్‌ను టి.ఎ.ఎల్ ఇటీవల అందించింది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ ఇటీవల హైదరాబాద్‌లో అధునాతన అపాచె ఫుసిలేజ్ సదుపాయాన్ని ప్రారంభించింది. 

English Title
Boeing new deal with Tata
Related News