నష్టాల్లో బి.ఓ.ఐ

Updated By ManamMon, 02/12/2018 - 21:06
boi

boiముంబయి: ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బి.ఓ.ఐ) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ. 2,341.23 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. రూ. 14,057 కోట్ల మేరకు ఉన్న మొండి బాకీల సంగతిని అది ఇప్పటివరకు వెల్లడించకపోవడంతోపాటు, ట్రెజరీ నష్టాలు కూడా దానికి కారణంగా భావిస్తున్నారు. బి.ఓ.ఐ గత ఆర్థిక సంవత్సరం క్యూ 3లో రూ. 102 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. బ్యాంకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,057 కోట్ల మేరకు ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు, రూ. 9,707 కోట్ల మేరకు ఉన్న నికర నిరర్థక ఆస్తుల సంగతిని వెల్లడించలేదని రిజర్వ్ బ్యాంక్ కనుగొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇలాగే రూ. 23,330 కోట్ల మేరకు ఉన్న మొండి బాకీల సంగతిని వెల్లడించకుండా దాచి పెట్టింది. ఫలితంగా బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సర క్యూ 3లో రూ. 1887 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయవలసి వచ్చింది. బి.ఓ.ఐ స్థూల రుణాలు రూ. 3,87,028 కోట్ల నుంచి రూ. 3,79,538 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 9,232 కోట్ల మూలధనం పొందుతోంది. 

Tags
English Title
BoI joins the under-reporting club:Logs in Rs 2,341 cr loss
Related News