వైఎస్సార్ సీపీకి బొమ్మిరెడ్డి గుడ్‌బై

Updated By ManamSat, 09/22/2018 - 13:33
Bommireddy Raghavendra Reddy resigned
Bommireddy Raghavendra Reddy given big shock to ysrcp

నెల్లూరు : నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జిల్లా పరిషత్ ఛైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ బొమ్మారెడ్డి రాఘవేంద్రరెడ్డి శనివారం పార్టీకి రాజీనామా చేశారు. కాగా ఇటీవల పార్టీలో చేరిన మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న బొమ్మరెడ్డి వైఎస్సార్ సీపీకి గుడ్‌బై చెప్పారు. 

ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి మాట్లాడుతూ... వైఎస్సాఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఓ డిక్టేటర్ అని విమర్శించారు. ఆనంకు బాధ్యతలు అప్పగించడం వల్లే తాను పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనను ఆయన అవమానించారని బొమ్మారెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరే ఉద్దేశ్యం తనకు లేదని బొమ్మిరెడ్డి స్పష్టం చేశారు. 

English Title
Bommireddy Raghavendra Reddy Resigned from ysr congress party
Related News