ఆజన్మ బ్రహ్మచారి నితిన్

Updated By ManamThu, 06/21/2018 - 07:02
nithin

imageహీరో నితిన్ ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మరో డిఫరెంట్ మూవీకి నితిన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. ‘ఛలో’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. సింగిల్ ఫరెవర్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో నితిన్ ఆజన్మ బ్రహ్మచారిగా కనిపించబోతున్నారు. ఇది ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనుండడం విశేషం. 

English Title
Brahmachari Nitin
Related News