వరుడు గడ్డం తీస్తేనే పెళ్లి.. మొండికేసిన వధువు!

Updated By ManamWed, 03/14/2018 - 15:17
Bride calls of marriage, Groom beard issue

Bride calls of marriage, Groom beard issue ఖాండ్వా: పెళ్లి విషయంలో అమ్మాయిలు మునుపటిలా మౌనం వహించడం లేదు. పెళ్లితంతు విషయంలో తమకు నచ్చనది ఏదైనా సరే కుండ బద్దలు కొట్టేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లైనా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే ఉన్నది ఉన్నట్టుగా తమ నిర్ణయాన్ని చెప్పేస్తున్నారు. ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలి.. మగాళ్లు ఎలా ఉన్నా చెల్లుతుందిలే అనే రోజలు పోయాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఓ పెళ్లికూతురు తాను పెళ్లిచేసుకోబోయే వరుడి వేషధారణ నచ్చలేదని పెళ్లికి నిరాకరించింది. పెళ్లి చూపుల సమయంలో గడ్డం లేకుండా రావడంతో ఇష్టపడ్డానని చెప్పిన వధువు.. పెళ్లి మంటపంలో వరుడు గడ్డంతో రావడం చూసి పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది.

గడ్డం గీసుకుని రావాల్సిందిగా వరుడుని వధువు బంధువులు కోరగా.. బంధువుల మధ్య తన పరువు తీస్తారా? పెళ్లి సవ్యంగా జరగాలని తమ కుమారుడు మొక్కుకుని గడ్డం పెంచాడని, వివాహం జరగక ముందే గడ్డం తీసేయమంటే ఎలా? అని వరుడు బంధువులు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలో పోలీసుల రంగ ప్రవేశం చేసి నచ్చచెప్పడంతో చివరికి వరుడు గడ్డం గీసుకున్నాడు. మరుసటి రోజు మరో ముహుర్తానికి పెళ్లి తంతు ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడండి..

English Title
Bride calls off marriage Groom comes to with beard
Related News