పెళ్లి నగల డబ్బును వరద బాధితులకు ఇచ్చేసింది

Updated By ManamSat, 08/25/2018 - 11:56
Kerala

Kerala తిరువనంతపురం: భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ వాసులను ఆదుకునేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు విరాళాలు ఇచ్చి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కొత్త పెళ్లికూతురు తన నగల డబ్బులను వరద బాధితులకు విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది. 

కేరళలోని కొజికోడ్ జిల్లా వటకారకు చెందిన అమృత ఎస్ వేణు బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. సెప్టెంబర్ 15న ఆమె వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక ఆమె నగల కోసం పక్కనపెట్టిన లక్ష రూపాయలను తీసి సీఎం సహాయనిధికి ఇవ్వాలని అమృత నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కాబోయే భర్తకు చెప్పగా.. ఆయన కూడా అంగీకరించారు. దీంతో ఆమె కోరిక మేరకు లక్ష రూపాయల చెక్‌ను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు అమృత తండ్రి కె.కె. వేణు.

English Title
Bride donates one lakh rupees for Kerala CMO
Related News