వీడియో: జీన్స్‌లో పెళ్లికూతురి బెల్లీ డాన్స్.. భలే!

Updated By ManamWed, 03/14/2018 - 16:19
Bindaas Bhangra In Choli, Jeans Is Viral, Watch And Learn, bride Rashika Yadav

Bindaas Bhangra In Choli, Jeans Is Viral, Watch And Learn, bride Rashika Yadav సాధరణంగా పెళ్లి వేడుకల్లో వధువులు డాన్స్ చేయడమే చూశాం. కానీ పెళ్లిలోనే కాదు.. పెళ్లికి ముందుకు కూడా కుందనపు బొమ్మలాంటి పెళ్లికూతుళ్లు ఇలా డాన్స్ చేస్తారని ఈ వీడియోను చూశాక మీరే అంటారు. తన పెళ్లికి అందంగా ముస్తాబయిన పంజాబ్‌కు చెందిన రషికా యాదవ్‌ అప్పటివరకూ ఉత్సాహాన్ని ఆపులేక ఇలా డాన్స్ చేసి ముచ్చట తీర్చుకుంది. చక్కగా తన చేతులకు గోరింటాకు, రంగురంగుల డిజైన్ గాజులు ధరించి, పెళ్లి నగలను అందంగా అలంకరించుకుంది. అంతేకాదండోయ్.. పెళ్లికి ధరించేందుకు రూపొందించిన చోళితో పాటు జీన్స్‌, స్నీకర్స్‌(షూస్‌) వేసుకొని చక్కగా ముస్తాబయింది.

ఈ సందర్భంగా పంజాబీ గాయకుడు మంక్రీత్‌ ఔలఖ్‌ పాట ‘కదార్‌’కు హుషారైన కిల్లర్ భంగ్రా స్టెప్పులు, మధ్యమధ్యలో బెల్లీ డాన్స్ స్టెప్పులు, బాలీవుడు డాన్స్ మూమెంట్స్ చేస్తూ హొయలొలికించింది. అందులోనూ రషికా కథక్ డాన్సర్ కూడా. గత 16ఏళ్లుగా కథక్ నృత్యాన్ని నేర్చుకోంటోంది. పెళ్లి వేడుకను తీపిగుర్తుగా నిలిచిపోవాలని భావించిన రషికా.. ఇలా డాన్స్ చేస్తూ.. ఫోటోగ్రాఫర్‌ ప్రియాంక కాంబోజ్‌ చోప్రాతో వీడియోను తీయించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారిన ఈ వీడియోకు 4.3 లక్షల వ్యూస్, 7వేలకు పైగా లైక్లు వచ్చాయి. వైరల్ అవుతున్న ఈ డాన్స్ వీడియోను మీరూ చూసి నేర్చుకోండి..

English Title
Bride's Bindaas Bhangra In Choli And Jeans Is Viral. Watch And Learn
Related News