విలువల వారధి - కోటేశ్వరమ్మ

Updated By ManamSun, 09/23/2018 - 06:16
Koteswaramma

imageప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమకారిణి, మహిళా హక్కుల పోరాటయోధురాలు, రచయిత్రిగా సాహితీవేత్తగా తనదైన ప్రత్యేకతను చాటుకున్న కొండపల్లి కోటేశ్వరమ్మ నేటి మహి ళలకు ఎంతో ఆదర్శం. స్వశక్తితో ఎదిగి ఆత్మాభిమానంతో జీవించారు. కృష్ణాజిల్లా పామర్రులో 1918, ఆగష్టు 5న ఆమె జన్మించారు. నాలుగైదేళ్ళ వయస్సులో మేనమామతో ప్ళ్ళైంది. ప్ళ్ళైన రెండేళ్ళ లోపునే భర్త మరణించాడు. తల్లి దండ్రులు ఈ పరిణామానికి హతాశులై, తప్పు సరిదిద్దు కునేందుకు ఆమెను చదివించారు. కుటుంబంలో పరిస్థితు లు చిన్నతనంలోనే జాతీయోద్యమం వైపు ఆకర్షితురాలిని చేశాయి. క్రమేపీ అప్పుడప్పుడే విస్తరిస్తున్న కమ్యూనిస్టు ఉద్యమంతోనూ సంబంధాలు పెరిగాయి. కమ్యూనిస్టు ఉద్య మ నాయకుడైన యువకుడు కొండపల్లి సీతారామయ్య ఆమెను వివాహం చేసుకుంటానని ముందుకు వచ్చాడు. గ్రామస్తులు వితంతు పునర్వివాహం అని దీన్ని వ్యతిరేకిస్తు న్నా కుటుంబ సభ్యుల సమ్మతిపై సీతారామయ్యతో కోటేశ్వ రమ్మ వివాహం జరిగింది.

ఒక మనిషి జీవితంలో ఇంత బాధ ఉంటుందా! అస లు ఇన్ని బాధలు భరించి ఉండటం సాధ్యమేనా! 
మనం అత్యంత అభిమానించే మనిషిని ఎక్కువగా దగ్గరగా ఉండకపోవడం వల్ల మనకు ఆయన అంటే ఉండే సదభిప్రాయం అలాగే ఉంటుంది అని ఉద్దేశం. మనం వారు కూడా మనలాంటి మనిషే అన్నది మనం మనసులో అను కోకపోవడం వల్ల మనకి వారి మీద ఉండే అంచనాలు ఎక్కువ ఉండటం వల్ల గాయపడుతూ ఉంటాం అప్పుడ ప్పుడు. అది మనం దూరంగా ఉండటం వల్ల అంతగా ఉండకపోవచ్చు. అలాగే కోటేశ్వరమ్మను సీతారామయ్య వదిలేసి వెళ్ళిపోయారు అన్నది జీర్ణించుకోవడానికి శక్యంకానిది. 

ఒక రకంగా పెళ్లికి ముందర కోటేశ్వరమ్మ జీవితం ఆనందంగా ఉందని అనుకోవచ్చు. పెళ్లి తరవాత ఆవిడ ఎక్కడ సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా లేకుండా పోయాయి. సుందరయ్య, సీతారామయ్య సిద్ధాంతాలు న మ్మి కమ్మూనిస్టుగా ఆవిడ చేసిన త్యాగాలు ఆవిడతో పాటు గా ఉన్నవారి త్యాగాలు మరువరానివి, మరచిపొలేనివి.

పిల్లలని కంటే సమస్యలు రావొచ్చు అని డాక్టర్ దగ్గరకి వెళ్ళే దారి కూడా లేక నాటువైద్యంతో ప్రాణం మీదకి తెచ్చు imageకోవడం, రోజుల తరబడి తిండి లేకుండా ఉండటం, చవక గా వచ్చే పళ్ళుతిని గడపటం, కొబ్బరినీళ్ళు తాగి ఎన్నికల ప్రచారంలో తిరగడం, జైలు జీవితం అన్నీ ఒక ఎత్తు, సీతారామయ్య వదిలేసి వెళ్ళిపోతే ఒంటరిగా జీవిత పోరా టం సాగించడం ఒకఎత్తు. ముప్పై అయిదేళ్ళకే దాదాపుగా ఒక జీవితాన్ని చూసి, ఆ తరవాత మళ్లీ చదువు ప్రారంభించి మళ్లీ జీవితాన్ని మొదలు పెట్టడం ఇంకో ఎత్తు. ముప్పై అయిదేళ్ళ వయసులో ఒంటరిగా చేతిలో రూపాయి లేకుండా చదువు ప్రారంభించి, పిల్లలకి దూరంగా బతుకు పోరాటం ప్రారంభించి, మధ్యలో జీవితం ఒక గాడిన పడు తోంది అనుకున్న సమయంలో చందు మరణం, రమేష్మ రణం, అరుణ ఆత్మహత్య ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలినా మొండిధైర్యంతో జీవిత పోరాటాన్ని సాగిస్తున్న కోటేశ్వరమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొవచ్చు.

నమ్ముకున్న పార్టీ, రెండు ముక్కలు కావడం, రెండిం టికి నెలనెల పది రూపాయలు పంపడం లాంటివి చదువు తుంటే బాధ వేస్తుంది. సీతారామయ్య పోయినప్పుడు పార్టీ రాకపోవడం మనషులు, మనషుల కన్నా పార్టికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చాల ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. అలాగే మోటూరి ఉదయం, సుందరయ్య మీద వ్యాసాలు మనకి తెలీని చాల విషయాలు మనకి తెలియజేస్తాయి.

సీతారామయ్యతో వివాహానంతరం కమ్యూనిస్టు ఉద్య మంలో మరింత చురుకుగా కోటేశ్వరమ్మ పనిచేసింది. పురుషులు, వేశ్యలు తప్ప మహిళలు నాటకాల్లో స్త్రీ పాత్రలు వెయ్యని రోజుల్లో మాభూమి, కన్యాశుల్కం వంటి నాట కాల్లో నటించింది. పార్టీ కార్యకర్తగా ఎంతో కృషి చేసింది. ఈ దశలో ఆమెకు కుమార్తె కరుణ, కుమారుడు చంద్రశేఖర్ జన్మించారు. పార్టీ పనుల వల్ల ఆమె జైలుశిక్ష కూడా అను భవించింది. 1948 తర్వాత కమ్యూనిస్టు పార్టీని నిషేధించి నప్పుడు బందరు, ఏలూరు, విశాఖపట్టణం, పూరీ, నాగ్ పూర్, రాయచూర్, గోంధియా వంటి ప్రాంతాలు సంచ రిస్తూ, భర్త, పిల్లలకు దూరమై అజ్ఞాత జీవితాన్ని గడుపు తూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీకి పని చేసింది. నిషేధం ఎత్తేశాక పార్టీ కార్యకర్తగా ఊరూరా తిరిగి జెండా భుజాన వేసుకుంది.

అయిష్టంగానైనా కొండపల్లి కోటేశ్వరమ్మని కొండపల్లి సీతారామయ్య భార్యగా పరిచయం చేయాల్సి వస్తోంది. ఎందుకంటే నాలాంటి వారికి ఆమె తెలియదు. ఆమె స్వీయ కథ, నిర్జన వారధిని చదివే ఆసక్తి కలగడానికి ఆమె సీతా రామయ్య భార్య కావడమే కారణం. కానీ చదవడం మొద లెట్టాకా చివరికంటా చదవడానికి కారణం మాత్రం కోటేశ్వ రమ్మే కాదు కాదు కోటేశ్వరవ్వే! ఆమె నడుస్తున్న చరిత్ర. తనకు తాను దీపపు వత్తియై, తన్ను తాను వెలిగించుకొని, నమ్మిన సిద్ధాంతం కొరకు జీవితాన్ని, పిల్లలనీ, తల్లినీ, తన నూ, తన ఆస్తినీ సర్వస్వాన్నీ ధారపోసి, ధారపోసే వారుం టారా అన్న సందేహానికి కోటేశ్వరవ్వ నిలువెత్తు సాక్ష్యం.

ఆమె ఆమెగానే సర్వస్వతంత్రంగా బతికిన కోటేశ్వర వ్వని ఇంకొకరి భార్యగా పరిచయం చేయాల్సి రావడం దురదృష్టమనే వుద్దేశ్యంతో నేను అయిష్టమన్నాను. నిజానికి కమ్యూనిస్టు వుద్యమానికి పరిచయం చెయ్యడమే సీతా రామయ్య ఈ అమ్మకు చేసిన ఉపకారం(?). కమ్యూనిస్టు వుద్యమంలో దిగిన రోజు నుండి ఈమె తన సర్వస్వాన్నీ పార్టీకి, వుద్యమానికే అర్పించింది.

ఈ కథ రాసిన తీరు, అవ్వ మన పక్కన కూర్చుని తన కథ చెబుతున్నట్లే వుంటుంది. చివరి వరకూ ఎక్కడా ఆత్మ స్తుతీ, పరనిందా కనిపించవు. అలా అని తనతో వుద్యమం లో కలిసి నడిచిన వారి త్యాగాలని ఎక్కడా మెచ్చకుండా వుండదు. అప్పట్లో ఇంత మంచి వారు వుండేవారా అని ఆశ్చర్య మనిపిస్తుంది.

అజ్ఞాతంలో వున్నపుడు పార్టీ నిర్ణయానుసారం గర్భ స్రావం చేయించుకోవడం, అదీమోటుపద్దతుల్లో, సరైన వై ద్య సౌకర్యం లేక ప్రాణాల మీదకి తెచ్చుకోవడం గుండెని మెలిపెడుతుంది. ఒక ధ్యేయాన్ని, ఆశయాన్ని ఇంత భయం కరంగా నమ్ముతారా అనిపిస్తుంది.

భర్త తనను విడిచి వెళ్ళడం, కొడుకు నక్సలైటు వుద్య మంలో చేరి చివరికి మాయమైపోవడం, వడదెబ్బతో అలు ్లడు, ఆ బాధతో కూతురూ అంతకు మునుపే జీవితమంతా తోడుగా నిలిచిన తల్లీ చనిపోవడం చదువుతుంటే  కన్నీ రంతా ఆవిరౌతుంది. కానీ అవ్వ చెప్పిందంతా తన మొత్తం కథలోై పెపై విషయాలేనేమో అనిపిస్తుంది. తను పాల్గొన్న ప్రతివేదికా, పోరాటం గురించి చెబితే పెద్ద గ్రంథమౌతుందేమో!

కోటేశ్వరవ్వ జీవితంలో అన్ని పాత్రలలోకీ నన్ను బాగా ఆకర్షించింది, కోటేశ్వరమ్మకి త్యాగంలో ధీటుగా నిలిచింది ఆమె అమ్మ. ఆమె కూడా తన జీవితాన్ని కర్పూరంలా వెలి గించింది. ఏ వుద్యమ ప్రభావం ఆమె మీద లేకున్నా అప్ప ట్లోనే తన కూతురికి వితంతు వివాహం చేయడానికి పోరా డుతుంది. ఆ తర్వాత కూతురి వెంటే వుంటూ వుద్య మాని కి తనదైన సహాయం చేస్తూ వచ్చింది. చివరికి తను చనిపో బోయే ముందు తను దాచుకున్న రెండు వేల రూపాయల్లో ఊభయ కమ్యూనిస్టు పార్టీలకీ చెరో వెయ్యి విరాళం ఇమ్మని చెప్పడం గుండెని కరిగించేస్తుంది. నాకైతే ఏడుపులో వెక్కి ళ్ళు రాకుండా ఆపుకోవడం కష్టమయిపోయింది.

చివరిగా నాకు శిఖర సమానమైన కోటేశ్వరవ్వ వ్యక్తి త్వంలో పలుకు రాయిలా అనిపించింది, సీతారామయ్య చివరి రోజుల్లో చూడ నిరాకరించడం, చివరి వరకూ తనని క్షమించక పోవడం. సీతారామయ్య ఒక భర్తగా తనకి తీరని అన్యాయం చేసి వుండవచ్చు అయినా గానీ తను కూడా ఈమె లాగానే పార్టీని దాని ఆదర్శాన్ని శ్వాసగా చేసు కున్న వాడే! ఒక సహాధ్యాయికి మల్లే తను చేయగలిగిన సేవలు చేయకుండా పార్టీకి మల్లేనే తనూ వదిలేసి వృద్ధాశ్రమంలో చేరడం ఆయన మీద ఆమెకి తీరని కోపమేమో!

ఓ వందపై చిలుకు పుటల్లో రాసిన ఓ వందేళ్ళ చరిత్ర ‘నిర్జన వారధి’!
తన కష్టాల గురించీ, తనను కష్ట పెట్టిన వాళ్ళ గురిం చీ, చాలా మామూలుగా రాయడం, ఏ భావోద్వేగమూ కన పడనీయకుండా. కానీ ఆ భావోద్వేగం మనకి మాత్రం కలు గుతుంది. కమూనిస్టులలోనూ మంచివాళ్ళూ ఉంటారు వేరేవాళ్ళూ ఉంటారు అనే రాశారు, కానీ చెడ్డవాళ్ళు అన్న పదం కూడా వాడలేదు. భర్త నుంచి విడిపోవలసిన పరిస్థితులు వచ్చినా ఆయనని పన్నెత్తు మాటైనా అనకుండా బాధపడుతూ చూడాలనుకుంటున్నా ఆత్మాభిమానం వల్ల వెళ్లడానికి ఇష్టపడలేదు. కరకుగా అలాగే ఉండి నలుగురూ చెబితే నిర్వికారంగా వెళ్ళనూ వెళ్లింది. ఆయన పోయినప్పు డు ఆయనలోని ఒకప్పుడయినా తను అనుభవించిన మంచి ని గుర్తు చేసుకుని బాధతో స్పందించింది. పుచ్చలపల్లి సుం దరయ్య లాంటి ప్రముఖులతో దగ్గర పరిచయాలున్నా కష్టకాలంలో కూడా ఎవరి ఇళ్ళలోనూ ఉండలేదు. ఉద్యోగం సంపాదింపు గల చదువు లేకపోయినా, అప్పుడు చదువుకు ని చిన్న ఉద్యోగం చేసుకుంది. శ్రీమంతుల ఇంట్లో పుట్టిన ఆమె మంచి రచనలు చేయగలిగినా ఆమె బతుకు తెరువుకి కళని గాక శ్రమనే నమ్ముకుంది. (ఆమె కథలూ, కవిత్వాలూ రాశారు, సంగీతం వచ్చు. మంచి కంఠం, కానీ వేటినీ బతుకుతెరువుకు ఉపయోగించుకోలేదు.) ఎన్నోసార్లు తన నగలని త్రుణప్రాయంగా సమర్పించిన మనిషి, హృదయ నిరాడంబరత ఆవెుది. నగలు ఒంటిైపె లేకుండా ఉండడమూ నిరాడంబరత్వమే, కానీ అది హృదయంలో కూడా ఉండబం అసలైన నిరాడంబరత్వం.  కోటీశ్వరమ్మ హృదయం నిరాడంబరం కాబట్టి ఆమె నగలు ధరించే డాంబికురాలిలా అగుపించరు. నగలు ధరించదమే ఆడంబ రం అనే నిర్ణయంలో ఉన్న వాళ్ళ ఆమె హృదయ నిరాడంబరత్వంలో లీనమైపోయి ఆమె వంటి మీది నగలపై దృష్టి నిలపనే లేరు. ఆమె జీవితం కష్టాలమయం. కొడుకు చందూ మీద ఆమె రాసుకున్న కవిత చదువుతూ ఉంటే మనసూ రోదించి గొంతు గద్గదం అయిపోతుంది. ఈ కాలంలో మనం రంగనాయకమ్మ పుస్తకాలు చదివి, బొట్టూ, తాళి, గాజులూ, నగలూ కోరని నిరాడంబరత్వాన్నీ ఆరా దనా పూర్వకంగా కల్లలో నింపుకుంటున్నామే, అవన్నీ ఆమె కాలంలో కమ్మూనిస్టుల్లో ఉందేవి అని ఆమె పుస్తకంలో తెలు స్తుంది. ఆమె గొప్ప కమ్మూనిస్టు గొప్ప క్షమాగుణం, ఆత్మగౌరవం గల మనిషి. ఆత్మగౌరవం క్షమాగుణానికి విరుద్ధం కాదు. 92 వయసులో చిన్నప్పట్నించీ జరిగిన విషయాలన్నిటినీ గుర్తు చేసుకుని చరిత్రాత్మక గ్రంథం రాశారు ఆమె. నిర్జన వారధి కేవలం ఆత్మకథే కాదు, అది ఓ చరిత్ర పుస్తకం కూడా, ఓ వినూత్న కలాఖండం కూడా. 

నక్సలైట్ నేత, పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ గత ఆగస్టులో తన 100 వ పుట్టిన రోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపు కున్నారు. కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోవడంతో అతి వాద ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రజా జీవితంతో మమేకమై ఉద్యమకారిణిగా, కళాకారిణిగా, కవ యిత్రిగా, రచయిత్రిగా తనదైన ముద్రవేశారు. జాతీయో ద్యమం, సంఘ సంస్కరణోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమా లలో ప్రధాన భూమిక పోషించిన ఆమె అజ్ఞాత వాసం గడిపారు. 

- దాసరి సుబ్రహ్మణ్యేశ్వర రావు
తెలుగు ప్రాచ్యభాషా విభాగం
9493033534

English Title
The bridge of values ​​- Koteswaramma
Related News