రూ.14కే రోజూ 1 జీబీ డేటా

Updated By ManamTue, 06/19/2018 - 16:20
BSNL Reviews Small Data Plans
  • 29 రూపాయలతో మూడు రోజుల పాటు రోజూ 1 జీబీ డేటా

  • చిన్న చిన్న ప్లాన్లను సవరించిన బీఎస్ఎన్ఎల్

BSNL Reviews Small Data Plansటెలికాం రంగంలో ఏ క్షణాన జియో అడుగుపెట్టిందో గానీ.. వినియోగదారులకు మాత్రం టెలికాం సంస్థలు పోటీ పడి మరీ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి. ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి కంపెనీలపై పెద్ద దెబ్బే వేసింది జియో. అయితే, అన్ని సంస్థల్లాగానే జాతీయ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా ఆఫర్లు ప్రకటిస్తోంది. మిగతా వాటితో పోలిస్తే కొంచెం తక్కువే అయినప్పటికీ తన వినియోగదారులను కాపాడుకునేందుకు ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇక, ప్రైవేటు ఆపరేటర్లు పెద్ద మొత్తాలపైనే దృష్టి పెడుతుండగా.. తాజాగా బీఎస్ఎన్ఎల్ మాత్రం చిన్న చిన్న ప్లాన్లపైనా ఆఫర్లను ప్రకటించింది. రూ.14, రూ.29, రూ.40, రూ.57 ప్లాన్లను సవరించింది.

అందుకు అనుగుణంగా రూ.14కే 110 ఎంబీకి బదులుగా ఒక్క రోజుకు 1 జీబీ డేటాను అందిస్తోంది. ఇప్పటిదాకా రూ.29 ప్లాన్‌లో భాగంగా మూడు రోజులకు గానూ 150 ఎంబీ డేటా మాత్రమే ఇస్తుండేది. ఇప్పుడు దానిని మూడు రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా ఇచ్చేలా మార్చింది. వాటి లాగానే రూ.40, రూ.57 ప్లాన్లను మార్చి రోజుకు 1 జీబీ డేటాను అందించనుంది. అంతేగాకుండా రూ.155, రూ.198 ప్లాన్లనూ మార్చింది బీఎస్ఎన్ఎల్. రూ.155 ప్లాన్‌లో భాగంగా రోజుకు 2 జీబీ చొప్పున 17 రోజుల పాటు అందించనుంది. రూ.198 ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా ఇవ్వనుంది. ఇక, ఇప్పటికే జియో పోటీని తట్టుకుని నిలబడేందుకు రూ.99, రూ.319 ప్లాన్లను అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. రూ.99 ప్లాన్‌తో 26 రోజుల పాటు అపరిమితి ఉచిత కాలింగ్‌తో పాటు ఉచితంగా కాలర్ ట్యూన్‌ను అందిస్తోంది.

English Title
BSNL Reviews Small Data Plans
Related News