మహిళను ఎత్తిపడేసిన ఎద్దు

Updated By ManamWed, 03/14/2018 - 16:36
Bull Hurls Woman InTo The Air
  • పది అడుగుల ఎత్తుకు ఎగిరి కింద పడిపోయిన మహిళ.. తలకు తీవ్రగాయాలు

Bull Hurls Woman InTo The Air

భరూచ్: రోడ్డు మీద తన మానాన తాను నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళను.. ఎక్కడినుంచి వచ్చిందో ఏమో గానీ ఓ మాయదారి ఎద్దు అంతెత్తు ఎత్తి పడేసింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ విషాద ఘటన గుజరాత్‌లోని భరూచ్‌లో బుధవారం ఉదయం జరిగింది. ఓ వ్యక్తితో మాట్లాడేసి ఎక్కడికో వెళుతున్న ఆమెను.. వెనకగా వచ్చిన ఎద్దు రెండు కొమ్ములతో పైకి లేపి పది అడుగుల ఎత్తుకు విసిరేసింది. దాని ధాటికి బాధిత మహిళ ముందు బైకులపై ఎగిరి పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే, అక్కడున్న వారు ఒళ్లు గగుర్పొడిచే ఘటనను చూస్తుండడం వరకే పరిమితమయ్యారు తప్ప ఏమీ చేయలేకపోయారు. మహిళను అంతెత్తు ఎత్తి పడేసినా కూడా ఆ ఎద్దు చాలా సాదాసీదాగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. మళ్లీ ఎవరిపైనా దాడి చేయలేదు. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

కాగా, ఎద్దు దాడిలో గాయపడిన ఆ మహిళ వివరాలు తెలియరాలేదు. వెంటనే అక్కడున్న వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఎద్దు ఎక్కడిది.. ఎవరిది అన్న కోణంలో విచారిస్తున్నారు. అది వీధిలో వదిలేసిన మామూలు ఎద్దా లేదంటే ఎవరైనా అలా వదిలేశారా అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఎవరైనా దానిని వదిలేసి ఉంటే నిర్లక్ష్యంగా కింద అతడిపై కేసు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటు, బాధితురాలి వివరాలనూ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన తాలూకు వీడియోను మీరు ఓ లుక్కేయండి...

English Title
Bull Hurls Woman InTo The Air
Related News