బీజేపీపై ప్రజలు కోపంతో ఉన్నారు

Updated By ManamWed, 03/14/2018 - 18:05
Rahul Gandhi

rahul gandhiన్యూఢిల్లీ: యూపీ, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన బైపోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తంచేశారు. ఈ బైపోల్స్‌లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. బీజేపీ పట్ల ఓటర్లు కోపంగా ఉన్నారనడానికి ఈ ఫలితాలు తార్కాణమని వ్యాఖ్యానించారు. యూపీలో పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పారు. అయితే ఇది రాత్రికి రాత్రి జరిగే పనికాదన్నారు. 

యూపీలోని గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌‌సభ నియోజకవర్గాలకు జరిగిన బైపోల్స్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీఎస్పీ మద్దతుతో పోటీ చేసిన సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఫలితాలతో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను ప్రజలు తిరస్కరించారని సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి అనురాగ్ బౌదౌరియా పేర్కొన్నారు. 

English Title
Bypoll results in Bihar and UP prove voters miffed with BJP, says Rahul Gandhi
Related News