బీజేపీ మోసం ప్రజలకు తెలిసిపోయింది

Updated By ManamWed, 03/14/2018 - 18:30
Ram Gopal Yadav

ram gopal yadavలక్నో: యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, బీజేపీపై ప్రజలకు విశ్వాసం లేదని సమాజ్‌వాది పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ అన్నారు. యూపీ బైపోల్స్‌ ఫలితాలతో ఈ విషయం తేటతెల్లం అయ్యిందని వ్యాఖ్యానించారు. యూపీలోని గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌‌సభ నియోజకవర్గాలకు జరిగిన బైపోల్స్‌లో సమాజ్‌వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీఎస్పీ మద్దతుతో పోటీ చేసిన సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఫలితాలపై స్పందించిన రాంగోపాల్ యాదవ్...దేశ ప్రజలను, చివరకు దేవుణ్ని కూడా బీజేపీ మోసగిస్తోందన్న విషయం యూపీ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. 

English Title
UP bypoll results show people don’t trust Yogi Adityanath government, BJP: Ram Gopal Yadav
Related News