సీబీఐ వలలో మంత్రి..డీజీపీ!

Updated By ManamThu, 09/06/2018 - 00:31
tamilnadu
  • తమిళనాట గుట్కా స్కాం కలకలం.. మంత్రి, డీజీపీ ఇళ్లలో సీబీఐ సోదాలు

  • మరికొందరు సీనియర్ పోలీసులపైనా.. ఏక కాలంలో 40 ప్రదేశాలలో దాడులు

  • గుట్కా తయారీదారుల నుంచి లంచాలు.. వారి వద్ద డైరీలో మంత్రి.. డీజీపీల పేర్లు

tamilnaduచెన్నై: తమిళనాడులో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయభాస్కర్, రాష్ట్ర డీజీపీ టీకే రాజేం ద్రన్‌ల ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. వందల కోట్ల విలువైన గుట్కా స్కాంకు సంబంధించి బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ దాడులు మొదలయ్యాయి. ఉదయం 7 గంటలకు ఏక కాలంలో 40 ప్రదేశాలలో సీబీఐ అధికారులు మోహరించారు. వీళ్లిద్దరితో పాటు మాజీ డీజీపీ ఎస్. జార్జి సహా మరికొందరు సీనియర్ పోలీసు అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిగాయని మాత్రమే సీబీఐ అధికారులు తెలిపారు తప్ప మిగిలిన వివరాలు వెల్లడించలేదు. తమిళనాడులోని కొన్ని పాన్ మసాలా, గుట్కా తయారీ కేంద్రాలు, వాటి తయారీదారుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు 2017 జూలై 8న దాడులు చేశారు. అప్పుడే గుట్కా స్కాం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 250 కోట్ల మేర పన్నులు ఎగవేసి నట్లు తెలిసింది. దాడుల సమయంలో అక్కడ ఒక డైరీ దొరికింది. అందులో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయ భాస్కర్, రాష్ట్ర డీజీపీ టీకే రాజేంద్రన్‌ల పేర్లున్నా యి. గుట్కా తయారీదా రుల నుంచి మంత్రి, డీజీపీ తీసుకున్న లంచాల బాగోతాలన్నీ బయట పడ్డాయి. కేన్సర్ కారకాలైన గుట్కా, పాన్‌మసా లాల తయారీ, విక్రయాలను 2013లోనే తమిళ నాడులో నిషేధించారు. అయినా అవి యథేచ్ఛగా మార్కెట్లలోకి వస్తూనే ఉన్నాయి. అన్నాడీఎంకే నాయకులు నిందితులతో చేతులు కలిపారన్న ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. డీఎంకే ఎమ్మెల్యే అంబళగన్ ఈ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టును ఆశ్రయించ డంతో, ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వాధికారులు, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ, ఆరోగ్యభద్రత శాఖలపై మే నెలలో సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ దాఖలుచేశారు. ఇప్పుడు ఏకంగా మంత్రి, డీజీపీల ఇళ్లలోనే సోదాలు చేయడంతో ఇది ఇంకెంత దూరం వెళ్తుందోనని చూస్తున్నారు.

Tags
English Title
Cabinet minister in CBI
Related News