బియ్యంలో కేన్సర్ నిరోధకత

Updated By ManamMon, 02/19/2018 - 03:23
Rice
  • మూడు రకాల వంగడాల గుర్తింపు

  • ఐజీకేవీ, బార్క్ పరిశోధకుల వెల్లడి

  • లంగ్, బ్రెస్ట్ కేన్సర్లపై ప్రభావం

Riceరాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో లభించే కొన్ని రకాల బియ్యంలో పలు కేన్సర్లను నిరోధించే శక్తి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఇక్కడ సంప్రదాయ పంటల నుంచి సేకరించే గత్వాన్, మహారాజి, లైచా రకాలలో ఈ గుణాలను గుర్తించినట్లు ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం (ఐజీకేవీ), బాబా అణుపరిశోధనా సంస్థ(బార్క్) పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మూడు రకాలకు ఊపిరి తిత్తులు, రొమ్ము కేన్సర్లను నయం చేసే ప్రత్యేక లక్షణం ఉందని, అది కూడా ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా తమ పని పూర్తిచేసే శక్తి ఉందని చెప్పారు. ఈమేరకు ఐజీకేవీకి చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ దీపక్ శర్మ తమ ఆవిష్కరణ ఫలితాలను మీడియాకు విడుదల చేశారు. ఈ మూడింటిలోనూ లైచా రకం బియ్యం మరింత శక్తిమంతమైనవని పేర్కొన్నారు. కేన్సర్ కారక కణాలను గుర్తించడంతో పాటు వాటిని మట్టుబెట్టడంలోనూ ఈ బియ్యం ముందుంటాయని శర్మ వివరించారు. కాగా, వివిధ రకాల పంట ఉత్పత్తులపై సంయుక్త పరిశోధనల కోసం యూని వర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) గత ఏడాది బార్క్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం లో భాగంగా చేపట్టిన పరిశోధనలలో ఇదొకటని వర్సిటీ పేర్కొంది. ఈ క్రమంలో అసోసియేట్ డైరెక్టర్ వీపీ వేణుగోపాలన్ మార్గదర్శకత్వం కింద ఓ బృందం సంప్రదాయ వరి వంగడాలపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని గుర్తించారు.

Tags
English Title
Cancer resistance in rice
Related News