పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ

Updated By ManamSun, 03/11/2018 - 23:07
health

healthనిజంగా ఆనందంగా ఉండాలంటే, సుఖ సంతోషాలు ఏడాది పొడవునా మనల్ని వీడిపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా అవసరమైనది తగినంత ఆరోగ్యమే. ఆరోగ్యంగా లేకపోతే ఉత్సాహం ఉండదు. ఇక వేదనలే అన్నీ. చాలా మంది కొత్త సంవత్సరంలో రకరకాల ప్రణాళికలు వేసుకుంటుంటారు. మంచి ఉద్యోగం సంపాదించాలని, ఇల్లు కట్టుకోవాలని, వాహనాలు, విలువైన ఆభరణాలు కొనుక్కోవాలని...ఇలా రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. కానీ వీటన్నింటి కన్నా ముఖ్యమైనది, ఆంత్యంత అవసరమైనది...అందరూ నిర్లక్ష్యం చేస్తున్నదీ మరొకటుంది...అదే ఆరోగ్యం. ఎన్ని లక్ష్యాలను పెట్టుకుని ఎంత శ్రమపడి ఏం సాధించినా ఆరోగ్యమనేదే లేకపోతే అంతా శూన్యమే. జీవనాన్ని చురుగ్గా ఆరోగ్యవంతగా పరిపూర్ణం చేసుకోవడానికి ఎలాంటి ఆరోగ్య ప్రణాళికను రూపొందించుకోవాలో తెలుసుకుందాం... 

ఆరోగ్యంగా జీవించడానికి ఎన్ని రకాలు మార్గాలున్నాయో... అన్ని రకాల ప్రణాళికలూ ఉన్నాయి. అయితే వాటిలో నిత్య జీవితంలో ఆచరించదగినవి కొన్ని మాత్రమే. ఈ ఆరోగ్య ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటేనే సరిపోదు. ఆ లక్ష్య సాధనలకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. మరి కొంతమంది ఆలోచనల్లో అయితే జిమ్‌లకు వెళ్లి అక్కడ సాధన చేస్తే మంచిదని, కఠినమైన యోగాసనాలు చేసి కడుపు మాడ్చుకుని కష్టపడితే గానీ ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ని కాపాడుకోలేమని భావిస్తుంటారు. నిజానికి ఇందులో వాస్తవం లేదు. ఆరోగ్యానికి అనుకున్నంతగా ఈ విధానాలు మేలుచేయవు. చాలామంది ఆరోగ్యం విషయంలో ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకున్నా వాటిని కానీ ఆచరణలో పెట్టడానికి రేపు, మాపు అని వాయిదాలతో బద్దకిస్తుంటారు. నిత్య జీవితంలో భాగమైన నీరు, ఆహారం, వ్యాయామం వంటి వాటిలో తగిన శ్రద్ధ తీసుకోవడం కూడా ఆరోగ్య ప్రణాళికలో ఒక భాగమే

తగినంత నిద్ర
waterతగినంత నిద్ర లేకపోవడం అనారోగ్యానికి పునాదిగా మారుతోంది. చాలామంది ఆఫీసు, బిజినెస్ అంటూ పనిలో పడి నిద్రాహారాలు మానేస్తున్నారు. దీనివల్ల తరచూ అనారోగ్యానికి గురౌతున్నారు. అయితే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. సరిపడేటంత నిద్ర ఉంటేనే శరీరంతో పాటు మెదడుకి కూడా చాలా విశ్రాంతి లభిస్తుంది. శక్తి రీ జనరేట్ అవుతుంది. రెండింతలు ఎక్కువగా పనిచేయగలుగుతారు. ఈ విషయంలో నిద్రని నిర్లక్ష్యం చేస్తూ చాలామంది తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే రోజూ నిర్ణీత సమయం పాటు నిద్రపోవాలన్నది ఆరోగ్య ప్రణాళికలో తప్పని సరిగా చేర్చుకోవాలి.

క్రమబద్ధమైన వ్యాయామం
healthఆరోగ్యానికి క్రమబద్ధమైన వ్యాయామం అవసరం. డాక్టర్లు రోజూ చేయమన్నారుగా అనే రీతిలో మొక్కుబడిగా చేసే వ్యాయామం వల్ల ఆరోగ్యానికి ఏమీ ఫలితం ఉండదు. నడకైనా, ప్రాణాయామమైనా ఒక క్రమబద్ధంగా చేయాలి. శరీర ఆకృతిని అందంగా తీర్చిదిద్దే క్రమంలో అధిక కొవ్వును వ్యాయామం ద్వారా చాలావరకు తగ్గించుకోవచ్చు. రక్తంలో ఉండే బీపీ, షుగర్ స్థాయిలను కూడా వ్యాయామమే నియంత్రణలో ఉంచగలదు. ఏ వయసు వారైనా.. ఎలాంటి వారైనా సరే తేలికగా చేసే వ్యాయామం నడక. ఇది చాలా తేలికగా సరదాగా సాగిపోతుంది. దీనివల్ల అధిక కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ లెవల్స్ లాంటివే కాకుండా మానసిక ఒత్తిడి దూరమై ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచాలన్నా ఆరోగ్య ప్రణాళికలో వ్యాయామం ఉండాల్సిందే.

వృద్ధుల ఆరోగ్యం కీలకం
healthవయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్యాలు ఏదో రూపంలో చుట్టుముట్టడం సహజమే. అయితే వృద్ధుల ఈ తమ దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవటం ద్వారా వ్యాధుల బారినడకుండా చూసుకోవటంతో పాటు తమ జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా శరీర అవయవాలను నిత్యం ఉప యోగిస్తుంటేనే అవి ఆరోగ్యకరంగా ఉంటాయన్న నిజాన్ని గుర్తించాలి. అందుకే శరీరానికీ, మెదడుకూ రోజూ తగినంత శ్రమ, వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ఆహారం, వ్యాయామం, ముఖ్యంగా పరిశుభ్రతల మీద శ్రద్ధ చూపాలి. చాలామంది ఓపిక లేక పరిశుభ్రత విషయంలో రాజీపడుతుంటారు. ఇదే పెద్దపెద్ద సమస్యలకు దారి తీస్తుంది. పొగాకు ఏ రూపంలోనూ తీసుకోకూడదు, మద్యానికి వీలైనంత దూరంగా ఉండాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. పెరిగిన బరువుని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆహారంలో మాంసకృత్తులు, కొవ్వులు తగినంత ఉండేలా చూసుకోవాలి. నిత్యం 30 నిమిషాలకు తగ్గకుండా నడక అవసరం. మోకాళ్ల నొప్పులుంటే వైద్యుని సలహా మేరకు వ్యాయామాలు చేయాలి. క్రమం తప్పకుండా బీపీ, సుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు, ముందస్తుగా క్యాన్సర్ చెకప్ చేయిస్తుండడం కూడా ఆరోగ్య ప్రణాళికలో భాగంగా కలుపుకోవాలి.

మహిళల ఆరోగ్య ప్రణాళికే కీలకం
మహిళలు కూడా తగిన ఆరోగ్య ప్రణాళికను రూపొందించుకోవాలి. సమాజంలో శారీరకంగా, మానసికంగా అనారోగ్యాలకు గురౌతున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అందరికీ నిర్ధేశించిన ఆరోగ్య ప్రణాళికను మహిళలు అనుసరిస్తూనే బాలికలు, మహిళలు, గర్భిణులు ఎవరికి వారే ఆరోగ్య ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణులు ప్రసవ సమయంలో సమస్యల్ని తట్టుకోవటానికి, గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి తగిన సమతుల్య ఆహారం అదనంగా తీసుకోవాలి. శిశువులో వేగంగా జరిగే పెరుగుదలకు పోషకాలు పాల ద్వారా తల్లి నుంచే బిడ్డకు చేరతాయి. అందువల్ల తల్లి తన గర్భంలో ఉన్న బిడ్డ అవసరాలకు సరిపడా తినడమే కాక తన అవసరాలకు కూడా సరిపోయే విధంగా ఆహారాన్ని తీసుకోవాలి. బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లి ఆరోగ్యం మీద పోషకాహార లోప ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీని ఫలితంగా చాలా సమస్యలుంటాయి. మహిళలు అన్ని దశల్లోనూ తగిన ఆరోగ్య ప్రణాళిను  రూపకల్పన చేసుకుని తప్పని సరిగా ఆచరించాలి. 

పరిశుభ్రమైన తాగునీరు
healthనీరు లేక పోతే జీవనమే లేదు. నిత్యం కలుషిత నీటివల్లే 80 శాతం వరకూ అనారోగ్యాలు అందర్నీ వెంటాడుతున్నాయి. మనం తాగుతున్న నీళ్లు మంచివా కావా అన్నది ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ఎక్కడపడితే అక్కడ దొరికే నీటిని తాగితే సమస్యలు తప్పవు. ఎందుకంటే ఆ నీటిలో చాలా రకాల బాక్టీరియా, మలినాలు ఉండవచ్చు. అందువల్ల తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో ఫిల్టర్లు వాడాలి. బాగా మరిగించి చల్లార్చిన నీటిని వాడడం అవసరం. బయటికి వెళ్లినప్పుడు ఇంటి నుంచే మంచినీటిని తీసుకువెళ్లాలి. తగినంత మంచినీరు తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాన్ని జీవ వ్యవస్థ ఎప్పటికప్పుడు బయటికి పంపేస్తుంది. అలా జరగడంలో తేడా వస్తే రకరకాల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, కాలేయ, కిడ్నీ సమస్యలు తప్పవు. అందువల్ల తాగే నీరు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. 

పోషకాహారం తప్పనిసరి
healthమంచి నీటి తర్వాత ఎంతో ముఖ్యమైంది పోషకారం. చాలామంది దృష్టిలో కేవలం నోటికి రుచినిచ్చేది, కడుపునింపేది మాత్రమే సరైన ఆహారం అనే అభిప్రాయం ఉంది. ఇందులో నిజంలేదు. శరీరానికి ఉపయోగపడే పోషకాలతో ఉన్న ఆహారమే తగిన ఆరోగ్యాన్ని అందిస్తుంది. తీసుకునే ఆహారం తాజాగా ఉండాలి. నిల్వ చేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయని గుర్తించాలి. ఆహారంలో ఏదో ఒక రూపంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చేపలు, గుడ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి. ధాన్యాలు, పప్పు దినుసులు కూడా ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ శరీర ఆరోగ్యాన్ని అనుక్షణం కాపాడతాయి. ఒక్కసారే పొట్టపగిలేలా తినడం కంటే వీలైనంతవరకు రోజుకు నాలుగైదుసార్లు పరిమితంగా తినడం అవసరం. ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువగా శ్రమించగలుగుతామనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.

ఒత్తిడికి దూరంగా ఉండాలి
healthప్రస్తుత సమాజంలో అన్ని వయసుల వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక ఒత్తిడి. ప్రతి మనిషికి ఏదో రూపంలో ఈ ఒత్తిడి అనేది ఉంటుంది. ఒక సమస్యను ఏ దృష్టితో చూస్తున్నారనేదాన్ని బట్టి ఒత్తిడి ఉంటుంది. కొందరు చిన్న సమస్యలను కూడా అదేపనిగా భూతద్ధంలో చూసుకోవడం, లేని దానిని కూడా సమస్యగా ఊహించుకుని ఒత్తిడికి గురౌతుంటారు. వీరి ప్రవర్తన ఇటు ఇంట్లో వాళ్లతో పాటు అటు ఫ్రెండ్స్, ఆఫీసులోని సహచరులపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి వారు మానసిక ఒత్తిడికి ఉపశమనం అనే అపోహతో సిగరెట్, తాగుడు, గుట్కా, జర్దా లాంటి వ్యసనాలకు వాటికి బానిసలైపోతారు శారీరక అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటారు. ఈ చెడు అలవాట్ల వల్ల ఒత్తిడి ఏ మాత్రం కూడా తగ్గదు. పని భారంగా ఉందనిపిస్తే దాన్ని తోటి ఉద్యోగులతో షేర్ చేసుకోవాలి. కాస్త సమయం తీసుకోవాలి. పూర్తి చేయాల్సిన పనికి తగిన సమయం లేకపోతే ఎవరైనా సరే కాస్త ఒత్తిడికి లోనవడం సహజమే. ఒత్తిడి నుంచి బయటపడడం సాధన చేస్తే, మానసికంగానే కాదు, శారీరకంగా కూడా ఆరోగ్యం మీ సొంతమౌతుంది. 

పిల్లల ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయి, క్రమబద్ధంగా తినడం మీద వారి శరీరంలోని ప్రధానంగా మెదడులోని చక్కెర స్థాయి ఆధారపడుతుంది. శరీరం, మెదడు, సక్రమంగా పని చెయ్యాలంటే ఈ చక్కెరస్థాయి స్థిరంగా ఉండాలి. ఫ్యాషన్ కోసమో, ఏదైనా వ్యాధి కారణంగానో తక్కువ తినడం, లేదా మరీ ఎక్కుగా తినడం అజీర్తికి, స్థూలకాయానికి దారితీస్తుంది. శరీరంలో అవసరానికి మించి చక్కెర ఉండడంవల్ల మెదడు సరిగ్గా పనిచేయదు. పోషక విలువలు లేని జంక్ ఫుడ్స్ తినడం వల్ల బలహీనమౌతారు. వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుంది. క్రమం లేకుండా తినడం, చాలా గంటలపాటు తినకుండా తరువాత ఒక్కసారే తినడం వల్ల శరీరంలోనూ, మెదడులోనూ అకస్మాత్తుగా చక్కెర ఎక్కువవుతుంది. దీని వలన నీరసంగా, అలసటగా, మత్తుగా అనిపి స్తుంది. దానితో కౌమార బాలలు చురుగ్గా పనిచేయలేరు.

పడుకునేటప్పుడు ఫోన్ పక్కనుంటే..?
Care on child healthస్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలామంది అదే లోకంగా దానితోనే గడుపుతుం టారు. ఎక్కడికెళ్లినా ఫోన్ వదులరు. ఆఖరికి పడుకునేటప్పుడు కూడా ఫోన్ పక్కన ఉండాల్సిందే. అలాంటి వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియో తరంగాలకు వీలైనంత దూరంగా ఉండాలి. చార్జింగ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడడం వల్ల అధికస్థాయిలో రేడియేషన్ విడుదలవుతుంది. అప్పుడు పొగలు రావడం, ఫోన్ పేలిపోవడం జరుగుతుంది. అధిక రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మొబైల్ రేడియేషన్ వల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి క్యాన్సర్. ఇప్పటికే చాలామంది స్మార్ట్‌ఫోన్ వాడకందారులు క్యాన్సర్ బారినపడినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో పలు మొబైల్ కంపెనీలు మొబైల్ డివైజ్‌లతో పాటు ఇచ్చే సెట్‌లో హెచ్చరిస్తున్నారు. మనం అవేం చదువం కాబట్టి తెలియదు. ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వల్ల వినికిడి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సాధ్యమైనంత వరకూ స్మార్ట్‌ఫోన్ వాడకానికి చాలా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

బరువు వేగంగా తగ్గాలా?
నేటి తరుణంలో అధిక బరువు తగ్గడం అనేది చాలా మందికి ఎంత సమస్యగా మారిందో అందరికీ తెలిసిందే. రాత్రికి రాత్రే బరువు weight-loss-natural-remediesతగ్గడం అనేది కుదరని పని అని కూడా అందరికీ తెలుసు. ఈ క్రమంలో బరువును తగ్గించుకునేందుకు అందరూ నానా అవస్థలు పడుతున్నారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు చేస్తున్నారు. అయితే ఇవే కాకుండా కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే దాంతో అధిక బరువును వేగంగా తగ్గించుకునేందుకు వీలుంటుంది. బరువు తగ్గవచ్చని చెప్పి చాలా మంది ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తుంటారు. కానీ ఇలా చేయరాదు. ఎందుకంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం వల్ల రోజులో మిగిలిన సమయంలో మరింత ఎక్కువ ఫుడ్‌ను లాగించేస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను ఎట్టి పరిస్థితిలోనూ మానేయరాదు. కాకపోతే అందులో కార్బొహైడ్రేట్స్ కాకుండా, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మంచిది. 
 

Tags
English Title
Care on child health
Related News