యూకో బ్యాంక్‌లో రూ.621 కోట్లు మోసం

Updated By ManamSun, 04/15/2018 - 12:39
UCO Bank Chairman

CBI Files Case Against Former UCO Bank Chairman For Rs. 621 Loss Involving Conspiracy

న్యూ ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉదంతం మర్చిపోకముందే తాజాగా మరో బ్యాంకులో నిబంధనలకు విరుద్దుంగా రుణాలను మంజూరు చేసిన వ్యవహారం వెలుగు చూసింది. పేరుగాంచిన యూకో బ్యాంకు మాజీ ఛైర్మెన్, అరుణ్‌ కౌల్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. సుమారు రూ.621 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై యూకో బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ అరుణ్‌ కౌల్‌తో పాటు మరి కొంత మంది బిజినెస్‌ ఎక్జిక్యూటివ్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎరా ప్రమోటర్లు బ్యాంకు చైర్మెన్‌తో కుమ్మకై బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తమ స్వంత ఖాతాల్లోకి మళ్ళించుకొన్నారని అభియోగాలు నమోదయ్యాయి. పక్కా ప్లాన్‌‌తో చేసినప్పటికీ ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో నిందితులు కంగుతిన్నారు. రంగంలోకి సిబిఐ నిందితుల నుంచి నిజానిజాలు రాబట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కాగా.. అరుణ్‌ కౌల్‌ 2010 నుంచి 2015 మధ్యంలో యూకో బ్యాంకుకు చైర్మన్‌గా వ్యవహరించారని, ఈ సంస్థలకు రుణాలు మంజూరు చేయడంలో అరుణ్‌ కౌల్‌దే ప్రధాన భూమిక అని సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్‌ రంగంలో ఫిబ్రవరి తర్వాత బయట పడిన మరో పెద్ద మోసం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. నిందితుల ఇళ్ళు, కార్యాలయాలపై సీబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఎరా ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌ ఇండియా (ఇఐఈల్‌) సిఎండి హేమ్‌సింగ్‌ భరానా, చార్టర్డ్‌ అకౌంట్లు పంకజ్‌ జైన్‌, వందనా శారదా, ఆల్టీస్‌ ఫిన్‌సర్వ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన పవన్‌ బన్సాల్‌పై కూడా సిబిఐ అభియోగాలు దాఖలు చేసింది. ఈ బ్యాంకు నుండి సుమారు రూ.650 కోట్లను స్వాహ చేసినట్టు సిబిఐ అనుమానిస్తుంది. అయితే ఈ కేసులో పోలీసులు, సీబీఐ ఎలా ముందుకెళ్తుందో.. నిందితులకు ఎలాంటి శిక్ష విధిస్తుందే వేచి చూడాల్సిందే.

 Arun Kaul

English Title
CBI Books Ex-UCO Bank Chairman In Rs 621 Crore Cheating Case
Related News