బిగ్‌బాస్ షోపై మాజీ జేడీ మళ్లీ కామెంట్స్..

Updated By ManamSun, 07/22/2018 - 17:09
CBI Ex JD Lakshmi Narayana Again COMMENTS on Bigg Boss 2 Show

CBI Ex JD Lakshmi Narayana Again COMMENTS on Bigg Boss 2 Show

హైదరాబాద్: తెలుగు బుల్లితెర‌పై అతిపెద్ద రియాలిటీ షోగా ప్రారంభ‌మై ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది ‘బిగ్‌బాస్’ 2. అయితే ఈ షో అంతే రీతిలో విమర్శలు కూడా వినవస్తున్నాయి. షోలో పెద్దగా పసలేదని కొందరు అంటుంటే.. ఇంకొందరమో షోలోని పార్టిసిపేట్స్‌పై ఇంకొందరు.. మరికొందరేమో వ్యాఖ్యాత నాని గురించి ఇలా పలు రకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికి ఓ సారి ఈ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తాజాగా మరోసారి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న ఆయన ఈ షో గురించి మాట్లాడుతూ..‘బిగ్ బాస్’ షోను స్టార్స్‌తో కాకుండా రైతులతో నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ఈయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈయన ఎప్పుడు చూసినా ఈ షో మీద పడుతున్నాడెందుకు..? అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంపదీసి ఇతనికేమైనా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ కావాలా ఏంటి..? అని ఇంకొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రజా సమస్యలపై మాట్లాడిన ఆయన.. "సామాజిక వర్గం కన్నా, సమాజమే ముఖ్యమని, ప్రజాస్వామ్యం వైపు పూర్తిగా ప్రజలు తమ ఆలోచనలు మళ్లించాలి. రాజకీయ వ్యవస్థలో మంచి మార్పు తీసుకురావాలి. జిల్లాలోని సమస్యలను తెలుసుకుని త్వరలోనే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను. ఈ సమస్యలపై మాట్లాడటానికి ఇప్పటికే అపాయింట్ మెంట్ కావాలని అడిగాను. సీఎంతో అపాయింట్ మెంట్ తేదీ ఫిక్స్ కాగానే నేను గుర్తించిన సమస్యలను నిశితంగా వివరిస్తాను. తూర్పుగోదావరి జిల్లా రైతులు, మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను గుర్తించాను. ఈ సమస్యలపై త్వరలో ఓ నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి, సంబంధిత అధికారులకు అందజేస్తాను" అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే సీఎం దృష్టికి ఈయన తీసుకెళ్లిన సమస్యలు ఎంత వరకు పరిష్కారమవుతాయో వేచి చూడాల్సిందే మరి.

English Title
CBI Ex JD Lakshmi Narayana Again COMMENTS on Bigg Boss 2 Show
Related News