‘గీత గోవిందం’పై పలువురి ప్రశంసలు

Updated By ManamThu, 08/16/2018 - 15:06
Geetha Govindam

Geetha Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ థియేటర్లలో దూసుకుపోతోంది. విడుదలకు ముందే ఈ చిత్రంలోని కొన్ని సీన్లు లీక్ అయినప్పటికీ.. రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ చిత్రాన్ని చూసిన మహేశ్ బాబు.. ‘‘గీత గోవిందం ఓ విజేత. సినిమా మొత్తం ఎంజాయ్ చేశాను. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా బాగా చేశారు. సుబ్బరాజు, వెన్నల కిశోర్‌లను ప్రత్యేకంగా పేర్కొనాలి. టీం మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ కామెంట్ పెట్టాడు. ‘‘గీత గోవిందం చూశాను. విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ ఇద్దరు ఉన్న ఏ చిత్రాన్నైనా చూస్తాను. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ సమంత స్పందించింది.

వీరితో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. ‘‘గీత గోవిందం చాలా బావుంది. విజయ్ దేవరకొండ నువ్వు చంపేశావు. రష్మిక మందన్నా నువ్వు సూపర్. వెన్నల కిశోర్ నిన్ను ప్రత్యేకంగా అభినందించాలి. మూలాలు మర్చిపోకూడదు. పరశురామ్ గ్రాండ్ సక్సెస్ నీ సొంతం. చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్’’ అంటూ పెట్టారు. అలాగే ‘‘గీత గోవిందం ఓ నవ్వుల ప్రవాహం. సినిమా మొత్తాన్ని ఎంజాయ్ చేశా. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ నిర్మాత శోభు యార్లగడ్డ పేర్కొన్నారు.

English Title
Celebrities praises on Geetha Govindam




Related News