ఏపీ సీఎస్‌కు కేంద్రం నుంచి పిలుపు

Updated By ManamTue, 02/20/2018 - 12:56
Dinesh Kumar

Dineshఅమరావతి: రాష్ట్రం గురించి చర్చలు జరిపేందుకు ఏపీ సీఎస్‌ దినేష్ కుమార్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు 23వ తేది సాయంత్రం హోంమంత్రిత్వ శాఖ మీటింగ్‌కు రావాలని సీఎస్‌కు సమాచారం వచ్చింది. పీఎంవో, రైల్వే బోర్డు అధికారులు పాల్గొనే ఈ మీటింగ్‌లో ఐదు అంశాలపై చర్చ జరగనుంది. అందులో రైల్వే జోన్, ఆర్థిక లోటు, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టులు ముఖ్యంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రతిపాదనలు, స్టేటస్ రిపోర్ట్‌తో ఏపీ సీఎస్ రావాలని కేంద్రం సూచించింది. అలాగే ఈ భేటీలో తొమ్మిది, పది షెడ్యూల్‌లోని విభజనపైనా చర్చ జరగనుండగా.. తెలంగాణ రాష్ట్ర అధికారులు హాజరుకానున్నారు.

English Title
Central Ministry calls to AP CS
Related News